Telugu Global
National

సీఎంలతో మళ్లీ మోదీ మీటింగ్‌.... మరోసారి లాక్‌డౌన్ ను తెరపైకి తెస్తారా?

దేశంలో కరోనా కేసులు మూడు లక్షలు దాటాయి. ప్రతిరోజూ పదివేలకు పైగా పాజిటివ్‌ కేసులు వస్తున్నాయి. కరోనా కేసుల్లో స్పెయిన్‌, యుకేను దాటేసి… ప్రపంచంలో 4వ స్థానానికి భారత్‌ చేరింది. మరికొన్ని రోజులు కేసుల సంఖ్య ఇలాగే కొనసాగితే… అమెరికా, రష్యాను దాటేసి రెండో స్థానానికి చేరుతాం. దేశంలో కరోనా కంట్రోల్‌ కావడం లేదు. కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో ఆందోళన మాత్రం జనాల్లో మొదలైంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 16,17న ముఖ్యమంత్రులతో సమావేశం […]

సీఎంలతో మళ్లీ మోదీ మీటింగ్‌.... మరోసారి లాక్‌డౌన్ ను తెరపైకి తెస్తారా?
X

దేశంలో కరోనా కేసులు మూడు లక్షలు దాటాయి. ప్రతిరోజూ పదివేలకు పైగా పాజిటివ్‌ కేసులు వస్తున్నాయి. కరోనా కేసుల్లో స్పెయిన్‌, యుకేను దాటేసి… ప్రపంచంలో 4వ స్థానానికి భారత్‌ చేరింది. మరికొన్ని రోజులు కేసుల సంఖ్య ఇలాగే కొనసాగితే… అమెరికా, రష్యాను దాటేసి రెండో స్థానానికి చేరుతాం.

దేశంలో కరోనా కంట్రోల్‌ కావడం లేదు. కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో ఆందోళన మాత్రం జనాల్లో మొదలైంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 16,17న ముఖ్యమంత్రులతో సమావేశం కాబోతున్నారు.

తొలిరోజు కరోనా కేసులు తక్కువగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం అవుతారు. ఆతర్వాత రోజు కరోనా కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల సీఎంలతో మీటింగ్‌ పెట్టారు. 17న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మాట్లాడుతారు.

ఇప్పటివరకూ ఈ మీటింగ్‌ ఎజెండా బయటకు రాలేదు. కానీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తుల, లోకల్‌గా లాక్‌డౌన్‌ విధింపు వంటి పరిస్థితులపై చర్చించే అవకాశం కన్పిస్తోంది.

మహారాష్ట్రలో కేసుల సంఖ్య లక్షదాటింది. ఒక్క ముంబైలోనే 55,451 పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. ఇక్కడ 2,044 మంది మృతి చెందారు. ఆ తర్వాత తమిళనాడులో 40,698, ఢిల్లీలో 34,687 కేసులు నమోదు అయ్యాయి.

మొత్తానికి పెరుగుతున్న కేసులతో దేశంలో ఆందోళన మొదలైంది. మొదటి లాక్‌డౌన్‌ ను సరైన సమయంలో‌ విధించకపోవడమే తప్పిదమా? లేక ఎగ్జిట్‌ ప్లాన్‌ వర్క్‌వుట్‌ కావడం లేదా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

First Published:  12 Jun 2020 8:17 PM GMT
Next Story