Telugu Global
Cinema & Entertainment

రమ్య కృష్ణ కారులో 96 బీర్‌ బాటిల్స్‌ !

ప్రముఖ సినీ నటి రమ్యకృష్ణ కారులో భారీగా మద్యం పట్టుబడింది. చెన్నై ఈసీఆర్‌ రోడ్డులో పోలీసులు తనిఖీలు చేస్తుండగా.. రమ్యకృష్ణ కారులో మద్యం దొరికింది. కానత్తూర్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీలో భాగంగా రమ్యకృష్ణ కారును తనిఖీ చేశారు. దీంతో కారులో 96 బీర్ బాటిల్స్, 8 ఇతర మద్యం సీసాలను గుర్తించారు . డ్రైవర్ సెల్వకుమార్‌ని పోలీసులు అరెస్టు చేశారు. స్టేషన్‌ బెయిల్‌పై రమ్యకృష్ణ అక్కడి నుంచి వెళ్లిపోయింది. రమ్యకృష్ణ కారు నెంబర్‌ టీఎన్‌ 07Q […]

రమ్య కృష్ణ కారులో 96 బీర్‌ బాటిల్స్‌ !
X

ప్రముఖ సినీ నటి రమ్యకృష్ణ కారులో భారీగా మద్యం పట్టుబడింది. చెన్నై ఈసీఆర్‌ రోడ్డులో పోలీసులు తనిఖీలు చేస్తుండగా.. రమ్యకృష్ణ కారులో మద్యం దొరికింది. కానత్తూర్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీలో భాగంగా రమ్యకృష్ణ కారును తనిఖీ చేశారు.

దీంతో కారులో 96 బీర్ బాటిల్స్, 8 ఇతర మద్యం సీసాలను గుర్తించారు . డ్రైవర్ సెల్వకుమార్‌ని పోలీసులు అరెస్టు చేశారు. స్టేషన్‌ బెయిల్‌పై రమ్యకృష్ణ అక్కడి నుంచి వెళ్లిపోయింది.

రమ్యకృష్ణ కారు నెంబర్‌ టీఎన్‌ 07Q 0099. కరోనా లాక్‌డౌన్‌తో చెన్నైలో మద్యం అమ్మకాలు ఆపివేశారు. దీంతో మహాబలిపురం నుంచి లిక్కర్ కొనుగోలు చేసి చెన్నైకి తీసుకొచ్చారు.

ఈ క్రమంలో పోలీసులు తనిఖీ చేస్తుండగా.. మద్యంతో పట్టుబట్టారు రమ్యకృష్ణ. అయితే భారీ మొత్తంలో మద్యం పట్టుబడటం కలకలం రేపుతోంది. లిక్కర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు రాబట్టేందుకు కూపీ లాగుతున్నారు పోలీసులు.

First Published:  13 Jun 2020 8:44 AM GMT
Next Story