Telugu Global
Cinema & Entertainment

కాస్టింగ్ కౌచ్ పై హీరోయిన్ కామెంట్స్

హీరోయిన్ తేజశ్వి కాస్టింగ్ కౌచ్ పై మరోసారి స్పందించింది. తనలాంటి తెలుగు హీరోయిన్లను కాదని, ఉత్తరాది నుంచి అమ్మాయిల్ని ఎందుకు తెచ్చుకుంటారో విడమర్చి చెప్పింది. ఉత్తరాది నుంచి వచ్చే హీరోయిన్లు చాలా ఫ్రీగా ఉంటారని, దేనికైనా ఓకే అంటారని.. అందుకే వాళ్లను తీసుకోవడానికి తెలుగు మేకర్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారని కుండబద్దలుకొట్టింది తేజశ్వి. “ఉత్తరాది నుంచి వచ్చే అమ్మాయిలు చాలా ఫ్రీగా ఉంటారు. పైగా వాళ్లు మానసికంగా సన్నద్ధమై ఉంటారు. తమ నుంచి మేకర్స్ ఏం కోరుకుంటున్నారు, […]

కాస్టింగ్ కౌచ్ పై హీరోయిన్ కామెంట్స్
X

హీరోయిన్ తేజశ్వి కాస్టింగ్ కౌచ్ పై మరోసారి స్పందించింది. తనలాంటి తెలుగు హీరోయిన్లను కాదని, ఉత్తరాది నుంచి అమ్మాయిల్ని ఎందుకు తెచ్చుకుంటారో విడమర్చి చెప్పింది. ఉత్తరాది నుంచి వచ్చే హీరోయిన్లు చాలా ఫ్రీగా ఉంటారని, దేనికైనా ఓకే అంటారని.. అందుకే వాళ్లను తీసుకోవడానికి తెలుగు మేకర్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారని కుండబద్దలుకొట్టింది తేజశ్వి.

“ఉత్తరాది నుంచి వచ్చే అమ్మాయిలు చాలా ఫ్రీగా ఉంటారు. పైగా వాళ్లు మానసికంగా సన్నద్ధమై ఉంటారు. తమ నుంచి మేకర్స్ ఏం కోరుకుంటున్నారు, వాళ్లకు ఏం అర్పించాలి లాంటి విషయాల్లో చాలా క్లియర్ గా ఉంటారు. 90శాతం మంది ఉత్తరాది అమ్మాయిలు కమిట్ మెంట్ కు అంగీకరించి సినిమాల్లోకి వస్తారు.”

అయితే ఇలా కమిట్ మెంట్ (పడక గది సుఖం) ఇవ్వాలనే సంగతి తెలుగు హీరోయిన్లకు, తమిళ హీరోయిన్లకు కూడా తెలుసని.. ఎటొచ్చి మనం మానసికంగా ఎంత సన్నద్ధంగా ఉన్నామనేది ఇంపార్టెంట్ అంటోంది తేజశ్వి. కమిట్ మెంట్ కు ఓకే అనుకుంటే అవకాశాలు ఇచ్చేవారు పరిశ్రమలో చాలామంది ఉన్నారంటోంది.

అయితే కెరీర్ స్టార్టింగ్ లోనే ఈ కాస్టింగ్ కౌచ్ చెత్త అంతా ఉంటుందని అంటోంది తేజశ్వి. అంతేకాదు.. అసలైన సినిమా జనాలు దీనికి దూరంగా ఉంటారని కూడా చెబుతోంది. కేవలం గ్లామర్, స్కిన్ బిజినెస్, డబ్బుకు ఆశపడి ఈ కాస్టింగ్ కౌచ్ పనులు చేస్తుంటారని.. ఈ 90శాతం చెత్తను దాటుకొని వెళ్తే.. అసలైన సినిమా జనాల్ని కలవొచ్చని, మంచి సినిమాలు చేయొచ్చని చెబుతోంది తేజశ్వి.

First Published:  13 Jun 2020 11:00 AM GMT
Next Story