Telugu Global
National

చంద్రబాబు సెక్యూరిటీ కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడి ఇంటి వద్ద బందోబస్తులో ఉన్న కానిస్టేబుల్‌ కరోనా బారినపడ్డారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసం వద్ద గుంటూరు జిల్లా బాపట్ల పట్టణ పీఎస్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ సెక్యూరిటీ విధులు నిర్వహించారు. మే 5న విధులు నిర్వహించేందుకు హైదరాబాద్‌ వెళ్లిన కానిస్టేబుల్ ఆ తర్వాత ఏడో తేది తిరిగి వచ్చాడు. అతడికి కరోనా అనుమానిత లక్షణాలు బయటపడడంతో పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో అతడికి కరోనా ఉన్నట్టు నిర్ధారణ అయింది. దాంతో అతడిని చికిత్స కోసం […]

చంద్రబాబు సెక్యూరిటీ కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్
X

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడి ఇంటి వద్ద బందోబస్తులో ఉన్న కానిస్టేబుల్‌ కరోనా బారినపడ్డారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసం వద్ద గుంటూరు జిల్లా బాపట్ల పట్టణ పీఎస్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ సెక్యూరిటీ విధులు నిర్వహించారు.

మే 5న విధులు నిర్వహించేందుకు హైదరాబాద్‌ వెళ్లిన కానిస్టేబుల్ ఆ తర్వాత ఏడో తేది తిరిగి వచ్చాడు. అతడికి కరోనా అనుమానిత లక్షణాలు బయటపడడంతో పరీక్షలు నిర్వహించారు.

పరీక్షల్లో అతడికి కరోనా ఉన్నట్టు నిర్ధారణ అయింది. దాంతో అతడిని చికిత్స కోసం తీసుకెళ్లారు. హైదరాబాద్‌లో విధులు నిర్వహించే సమయంలో ఇతడు కరోనా బారినపడినట్టు భావిస్తున్నారు.

దీంతో చంద్రబాబు నివాసం వద్ద సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్న మిగిలిన పోలీసులకూ కరోనా పరీక్షలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. తోటి కానిస్టేబుల్‌ నుంచి ఇతడికి కరోనా సోకినట్టు అనుమానిస్తున్నారు.

First Published:  13 Jun 2020 8:04 PM GMT
Next Story