Telugu Global
Cinema & Entertainment

హైపర్ ఆదికి అనసూయ రిఫరెన్స్

జబర్దస్త్ జోడీ అనసూయకు, హైపర్ ఆదికి ఆన్ స్క్రీన్ మంచి కెమిస్ట్రీ ఉంది. కేవలం హైపర్ ఆది స్కిట్స్ లో మాత్రమే అనసూయ స్టెప్పులు వేస్తుంది. ఆది, అనసూయ కలిసి స్టెప్పులేస్తే జబర్దస్త్ కు ఓ లుక్, కిక్ వస్తుందని అనేవాళ్లు కూడా చాలామంది ఉన్నారు. ఈ జోడీకి అంత క్రేజ్ ఉంది. అయితే అనసూయ-ఆదిది కేవలం ఆన్ స్క్రీన్ బంధమే కాదు, ఆఫ్-స్క్రీన్ కూడా వీళ్లిద్దరూ మంచి స్నేహితులు. అనసూయ-ఆది ఎంత మంచి ఫ్రెండ్స్ అని […]

హైపర్ ఆదికి అనసూయ రిఫరెన్స్
X

జబర్దస్త్ జోడీ అనసూయకు, హైపర్ ఆదికి ఆన్ స్క్రీన్ మంచి కెమిస్ట్రీ ఉంది. కేవలం హైపర్ ఆది స్కిట్స్ లో మాత్రమే అనసూయ స్టెప్పులు వేస్తుంది. ఆది, అనసూయ కలిసి స్టెప్పులేస్తే జబర్దస్త్ కు ఓ లుక్, కిక్ వస్తుందని అనేవాళ్లు కూడా చాలామంది ఉన్నారు. ఈ జోడీకి అంత క్రేజ్ ఉంది. అయితే అనసూయ-ఆదిది కేవలం ఆన్ స్క్రీన్ బంధమే కాదు, ఆఫ్-స్క్రీన్ కూడా వీళ్లిద్దరూ మంచి స్నేహితులు.

అనసూయ-ఆది ఎంత మంచి ఫ్రెండ్స్ అని చెప్పడానికి మరో ఉదాహరణ ఇది. ఈ లాక్ డౌన్ టైమ్ లో ఆది పూర్తిగా ఫ్రీ అయిపోయాడు. జబర్దస్త్ తో పాటు సినిమా షూట్స్ కూడా లేవు. అతడి ఆదాయం తగ్గిందనేది వాస్తవం. సరిగ్గా ఇలాంటి టైమ్ లో అనసూయ రూపంలో ఆదికి ఓ మంచి వెబ్ సిరీస్ అవకాశం తగిలింది.

రీసెంట్ గా ఓ వెబ్ సిరీస్ కు ఓకే చెప్పిందట అనసూయ. అయితే అందులో తనతో పాటు ఆదికి కూడా అవకాశం ఇవ్వాలని, తనకు ఎంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారో ఆదికి కూడా అంతే ఇవ్వాలని డిమాండ్ చేసిందట. దీంతో మేకర్స్ ఆదిని కూడా తీసుకున్నారు. ఇలా అనసూయ రిఫరెన్స్ తో వెబ్ సిరీస్ అవకాశం అందుకున్నాడట ఆది.

First Published:  14 Jun 2020 9:35 AM GMT
Next Story