Telugu Global
National

ఆదిలాబాద్‌ పల్లెకు కలెక్టర్‌ పేరు.... ఇంతకీ ఈమె గొప్పతనం ఏంటి?

దివ్యా దేవ‌రాజ‌న్. ఒకప్పుడు ఆదిలాబాద్‌ కలెక్టర్‌ . ఇప్పుడు తెలంగాణ శిశు, సంక్షేమ శాఖ కమిషనర్‌. ఆదిలాబాద్ క‌లెక్టర్‌గా ఆమె అందించిన సేవలను ఇప్పటికీ అక్కడి గిరిజనులు గుర్తు చేసుకుంటున్నారు. ఆమెకు గుర్తుగా ఓ ప్రాంతానికి దివ్యగూడ అని పేరు పెట్టుకున్నారు. ఓ కలెక్టర్‌ కు ఇంతకు మించిన గౌరవం ఇంకేం ఉంటుంది. దివ్యా దేవరాజ‌న్ ఆదిలాబాద్‌లో కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టినప్పుడు అక్కడ గొడవలు జరుగుతున్నాయి. దీంతో వారి సమస్యలను తెలుసుకునేందుకు మూడు నెలల్లో వారిభాష నేర్చుకున్నారు. […]

ఆదిలాబాద్‌ పల్లెకు కలెక్టర్‌ పేరు.... ఇంతకీ ఈమె గొప్పతనం ఏంటి?
X

దివ్యా దేవ‌రాజ‌న్. ఒకప్పుడు ఆదిలాబాద్‌ కలెక్టర్‌ . ఇప్పుడు తెలంగాణ శిశు, సంక్షేమ శాఖ కమిషనర్‌. ఆదిలాబాద్ క‌లెక్టర్‌గా ఆమె అందించిన సేవలను ఇప్పటికీ అక్కడి గిరిజనులు గుర్తు చేసుకుంటున్నారు. ఆమెకు గుర్తుగా ఓ ప్రాంతానికి దివ్యగూడ అని పేరు పెట్టుకున్నారు. ఓ కలెక్టర్‌ కు ఇంతకు మించిన గౌరవం ఇంకేం ఉంటుంది.

దివ్యా దేవరాజ‌న్ ఆదిలాబాద్‌లో కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టినప్పుడు అక్కడ గొడవలు జరుగుతున్నాయి. దీంతో వారి సమస్యలను తెలుసుకునేందుకు మూడు నెలల్లో వారిభాష నేర్చుకున్నారు. వారిలో ఒకరిలా కలిసిపోయారు. వారు తండాలకు వెళ్లారు. వారి సమస్యలు విని పరిష్కారం చూపారు. వారి పెళ్లిళ్లకు హాజరయ్యారు. వారితో కలిసి డ్యాన్స్‌ చేశారు. అప్పటివరకూ ఉన్న భూవివాదాలతో పాటు చాలా సమస్యలకు పరిష్కారం చూపారు.

న్యూ ఇయ‌ర్‌కి, ఇత‌ర పండుగ‌ల‌కు ఎవ‌రైనా శుభాకాంక్షలు చెప్పేందుకు బోకేలు, శాలువ‌లు తీసుకురావద్దని చెప్పారు. వాటికి బదులుగా పుస్తకాలు, పెన్నులు , ప్రభుత్వ స్కూల్ విద్యార్థుల‌కు దుప్పట్లు తీసుకురావాల‌ని చెప్పేవారు. అలా వ‌చ్చిన వాటిని ప్రభుత్వ పాఠ‌శాల‌ల్లోని విద్యార్థుల‌కు పంచారు. అడవుల జిల్లా నుంచి ఇలాంటి చాలా మార్పులకు ఆమె శ్రీకారం చుట్టారు.

ఆదిలాబాద్‌ జిల్లాలో చాలా సమస్యలు ఆమెకు ఎదురయ్యాయి. కానీ ఆమె తనదైన శైలి‌లో పరిష్కారం చూపారు. గిరిజనులు, ఆదివాసీల మధ్య గొడవ వచ్చినపుడు కూడా రెండు వర్గాలను కూర్చొబెట్టి సమస్యలు విన్నారు. మీ సమస్య తెలిస్తే కదా… పరిష్కారం వెతికేది అని వారికి చెప్పి… ఆరు నెలల టైమ్‌ తీసుకుని వారిని శాంతింపజేశారు. ఇలా పాలనలో తనదైన మార్క్‌ను ఆమె చూపించారు. అందుకే గిరిజనులు ఆమె పేరును తమ గూడెంకి పెట్టారు. దివ్యగూడెంగా పిలుచుకుంటున్నారు.

ఈ కలెక్టర్‌ విజయగాథను పలువురు కలెక్టర్లు సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తున్నారు.

First Published:  13 Jun 2020 7:42 PM GMT
Next Story