Telugu Global
Cinema & Entertainment

కొత్త సినిమాలు చేయడం లేదు

హీరో సుశాంత్ తన కొత్త సినిమాలపై క్లారిటీ ఇచ్చాడు. ఓ కొత్త సినిమాకు సంతకం చేశాడని, హీరోయిన్ ఇషా రెబ్బతో కలిసి ఆ సినిమా చేయబోతున్నాడంటూ పుకార్లు రావడంతో సుశాంత్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం తన చేతిలో ఒకే ఒక్క సినిమా ఉందని, ఎలాంటి కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని స్పష్టంచేశాడు. “హాయ్.. అందరూ జాగ్రత్తగా ఉన్నారని అనుకుంటున్నాను. ఇచ్చట వాహనములు నిలపరాదు సినిమా షూటింగ్ 75 శాతం పూర్తయింది. అందర్లానే మేం […]

కొత్త సినిమాలు చేయడం లేదు
X

హీరో సుశాంత్ తన కొత్త సినిమాలపై క్లారిటీ ఇచ్చాడు. ఓ కొత్త సినిమాకు సంతకం చేశాడని, హీరోయిన్ ఇషా రెబ్బతో కలిసి ఆ సినిమా చేయబోతున్నాడంటూ పుకార్లు రావడంతో సుశాంత్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం తన చేతిలో ఒకే ఒక్క సినిమా ఉందని, ఎలాంటి కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని స్పష్టంచేశాడు.

“హాయ్.. అందరూ జాగ్రత్తగా ఉన్నారని అనుకుంటున్నాను. ఇచ్చట వాహనములు నిలపరాదు సినిమా షూటింగ్ 75 శాతం పూర్తయింది. అందర్లానే మేం కూడా పరిస్థితుల బట్టి షూటింగ్ కు దిగాలని అనుకుంటున్నాం. గత కొన్ని రోజులుగా కొన్ని కథలు వింటున్నాను. కానీ ఏ ప్రాజెక్టుకూ సైన్ చేయలేదు. ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే స్వయంగా నేనే ప్రకటిస్తాను. కాబట్టి నా కొత్త సినిమాపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలు.”

ఇలా తన అప్ కమింగ్ మూవీస్ పై క్లారిటీ ఇచ్చాడు సుశాంత్. ప్రస్తుతం చేస్తున్న ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమా షూటింగ్ పైనే తన దృష్టి మొత్తం ఉందని, అది థియేటర్లలోకి వచ్చిన తర్వాత కొత్త సినిమాపై ఓ ప్రకటన చేస్తానని అంటున్నాడు సుశాంత్.

ఈ లాక్ డౌన్ టైమ్ లో ఇంటికే పరిమితమైన ఈ అక్కినేని హీరో పియానో నేర్చుకున్నాడు. దానిపై మనం థీమ్ మ్యూజిక్ ను కూడా ప్లే చేశాడు.

First Published:  14 Jun 2020 4:14 AM GMT
Next Story