Telugu Global
NEWS

అఖిలప్రియ సోదరుడిపై కేసు

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరుడు జగత్‌ విఖ్యాత్ రెడ్డిపై కేసు నమోదు అయింది. పోలీస్‌స్టేషన్‌పైకి అనుచరులతో వెళ్లి దౌర్జన్యం చేసిన వ్యవహారంలో ఆళ్లగడ్డ పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక గ్రామంలో పొలం వద్ద రెండు వర్గాలు గొడవ పడ్డాయి. ఈ గొడవపై ఇరు వర్గాలు పరస్పరం కేసులు పెట్టుకున్నాయి. ఇంతలో గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు సుధాకర్ రెడ్డిని హత్య చేసేందుకు ప్రయత్నించారన్న అభియోగంపై నరసింహులు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ […]

అఖిలప్రియ సోదరుడిపై కేసు
X

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరుడు జగత్‌ విఖ్యాత్ రెడ్డిపై కేసు నమోదు అయింది. పోలీస్‌స్టేషన్‌పైకి అనుచరులతో వెళ్లి దౌర్జన్యం చేసిన వ్యవహారంలో ఆళ్లగడ్డ పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక గ్రామంలో పొలం వద్ద రెండు వర్గాలు గొడవ పడ్డాయి. ఈ గొడవపై ఇరు వర్గాలు పరస్పరం కేసులు పెట్టుకున్నాయి. ఇంతలో గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు సుధాకర్ రెడ్డిని హత్య చేసేందుకు ప్రయత్నించారన్న అభియోగంపై నరసింహులు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ విషయం తెలుసున్న జగన్‌ విఖ్యాత్ రెడ్డి అనుచరులతో పాటు స్టేషన్‌కు వెళ్లి దౌర్జన్యం చేశారు. పోలీసుల అదుపులో ఉన్న నరసింహను బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్లాడు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో పోలీసులు తిరిగి వెళ్లి భూమా నివాసం వద్ద ఉన్న నిందితుడిని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు.

స్టేషన్ వద్దకు అనుచరులతో వచ్చి దౌర్జన్యం చేయడంతో పాటు అదుపులో ఉన్నవ్యక్తిని తీసుకెళ్లినందుకు గాను విఖ్యాత్ రెడ్డిపై కేసులు నమోదు అయ్యాయి. సెక్షన్ 353, 224, 225, 212 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆళ్లగడ్డ పట్టణ పోలీస్ స్టేషన్‌లో విఖ్యాత్ రెడ్డిపై కేసు నమోదు అయింది.

ఇప్పటికే భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్‌లు… టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిని హత్య చేయించేందుకు ప్రయత్నించారన్న అభియోగాలు ఎదుర్కొంటున్నారు.

First Published:  15 Jun 2020 5:38 AM GMT
Next Story