Telugu Global
NEWS

అచ్చెన్న అరెస్టుకు... బీసీలకు ఏం సంబంధం : బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు

ఈఎస్ఐ అవినీతి స్కాంలో ఇరుక్కున్న మాజీ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడి అరెస్టును చంద్రబాబు బీసీలపై జరిగిన దాడిగా చిత్రీకరించడానికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. అధికారంలో ఉన్నన్ని రోజులు అచ్చెన్న ఏనాడూ బీసీల ఊసే ఎత్తలేదు కానీ.. ఇప్పుడు హఠాత్తుగా ఆయన బీసీల నాయకుడిగా లబ్దిపొందాలని చూడటంపై సొంత పార్టీ నాయకులే ఆశ్చర్యపోతున్నారు. అచ్చెన్న అరెస్టుపై బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్‌రావు స్పందించారు. అచ్చెన్నాయుడు అవినీతి కేసులో అరెస్టయ్యారు తప్ప, బీసీ ప్రయోజనాల కోసం […]

అచ్చెన్న అరెస్టుకు... బీసీలకు ఏం సంబంధం : బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు
X

ఈఎస్ఐ అవినీతి స్కాంలో ఇరుక్కున్న మాజీ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడి అరెస్టును చంద్రబాబు బీసీలపై జరిగిన దాడిగా చిత్రీకరించడానికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. అధికారంలో ఉన్నన్ని రోజులు అచ్చెన్న ఏనాడూ బీసీల ఊసే ఎత్తలేదు కానీ.. ఇప్పుడు హఠాత్తుగా ఆయన బీసీల నాయకుడిగా లబ్దిపొందాలని చూడటంపై సొంత పార్టీ నాయకులే ఆశ్చర్యపోతున్నారు. అచ్చెన్న అరెస్టుపై బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్‌రావు స్పందించారు.

అచ్చెన్నాయుడు అవినీతి కేసులో అరెస్టయ్యారు తప్ప, బీసీ ప్రయోజనాల కోసం పోరాటం చేసి జైలు పాలు కాలేదని శంకర్ రావు అన్నారు. ఆయన వ్యక్తిగత హోదాలోనే తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని.. ఒక వేళ ఆయన బీసీల ప్రయోజనం కోసం పోరాడి అరెస్ట్ అయితే అప్పుడు మేమంతా ఆయన వెంట ఉంటామని ఆయన చెప్పారు.

బీసీల కోటాలోనే ఆయన ఎమ్మెల్యే సీటు, మంత్రి పదవి పొందారు. కానీ ఏనాడూ బీసీల కోసం ఒక్క పని చేయలేదు. ఆయనను మేమంతా బీసీ ద్రోహిగానే చూస్తున్నామని ఆయన చెప్పారు. అచ్చెన్న అరెస్టుకు నిరసనగా అంబేత్కర్, జ్యోతిరావు పూలే విగ్రహాలకు వినతి పత్రాలు ఇవ్వాలని చంద్రబాబు ఇచ్చిన పిలుపు పెద్ద డ్రామా అని ఆయన ఎద్దేవా చేశారు. ఈ అరెస్టు విషయాన్ని టీడీపీ పార్టీ పరంగా చూసుకోవాలి కానీ అనవసరంగా బీసీ లను ఇందులోకి లాగొద్దని ఆయన స్పష్టం చేశారు.

First Published:  15 Jun 2020 12:15 AM GMT
Next Story