Telugu Global
National

ఆత్మహత్య చేసుకున్న యువ బాలీవుడ్ కథానాయకుడు

డిప్రెషన్‌తోనే అంటున్న కుటుంబ సభ్యులు శోక సంద్రంలో బాలీవుడ్ వారం క్రితమే సుశాంత్ మాజీ మేనేజర్ ఆత్మహత్య టీవీ నటుడి నుంచి బాలీవుడ్ హీరో వరకు ఎదిగిన సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ ఆదివారం ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొంత కాలంగా తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్న సుశాంత్ అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకోవడం బాలీవుడ్‌నే కాక యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచింది. ఎంతో భవిష్యత్ ఉన్న ఒక యువ కథానాయకుడు అర్థాంతరంగా తనువు చాలించడంతో […]

ఆత్మహత్య చేసుకున్న యువ బాలీవుడ్ కథానాయకుడు
X
  • డిప్రెషన్‌తోనే అంటున్న కుటుంబ సభ్యులు
  • శోక సంద్రంలో బాలీవుడ్
  • వారం క్రితమే సుశాంత్ మాజీ మేనేజర్ ఆత్మహత్య

టీవీ నటుడి నుంచి బాలీవుడ్ హీరో వరకు ఎదిగిన సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ ఆదివారం ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొంత కాలంగా తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్న సుశాంత్ అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకోవడం బాలీవుడ్‌నే కాక యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచింది. ఎంతో భవిష్యత్ ఉన్న ఒక యువ కథానాయకుడు అర్థాంతరంగా తనువు చాలించడంతో బాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది.

పోలీసులు, స్నేహితుల కథనం మేరకు.. శనివారం రాత్రి ఆలస్యంగా నిద్రపోయిన సుశాంత్.. ఉదయమే లేచి కొంచెం జ్యూస్ తాగాడు. ఆ తర్వాత తన గదిలోనికి వెళ్లి నిద్రపోయాడు. అయితే అతని ఫ్లాట్‌లోనే ఉండే పనివాళ్లు అతని గది తలుపులు ఎంత కొట్టినా తీయలేదు. దీంతో పనివాళ్లు సుశాంత్ స్నేహితులకు ఫోన్ చేశారు. దీంతో వెంటనే ఫ్లాట్‌కు చేరుకున్న స్నేహితులు తలుపు పగులగొట్టి చూడగా.. బెడ్‌షీట్‌తో ఫ్యాన్‌కు ఉరేసుకొని కనిపించాడు.

వెంటనే సుశాంత్ స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. వాళ్లు వెంటనే వచ్చి ఫ్లాట్‌ను క్షణ్ణంగా పరిశీలించారు. అతడి గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని.. కానీ మానసిక చికిత్సకు ఉపయోగించే మాత్రలు మాత్రం కనిపించాయని పేర్కొన్నారు. స్నేహితులు కూడా సుశాంత్ గత కొన్నాళ్లుగా మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు చెప్పారు. దీంతో పోలీసులు ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాధమికంగా నిర్థారించారు.

కాగా, శనివారం రాత్రి ఒక బుల్లితెర యాక్టర్‌కు సుశాంత్ ఫోన్ చేయగా అవతల వ్యక్తి లిఫ్ట్ చేయలేదని తెలిసింది. ఇక ఉదయం లేచిన సుశాంత్ తన సోదరితో కాసేపు మాట్లాడినట్లు కూడా పోలీసులు గుర్తించారు. మరోవైపు, సుశాంత్‌కు మేనేజర్‌గా పని చేసిన దిశ సలైని అనే యువతి ఆరు రోజుల క్రితం ముంబైలోని మలాడ్ ప్రాంతంలో భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఏఐట్రిపుల్ఈ పరీక్షలో ఆలిండియా 7వ ర్యాంక్ సాధించిన సుశాంత్.. ఢిల్లీలోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలో చదివాడు. అయితే మోడలింగ్, నటనపై మక్కువతో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్‌లో చదువు మానేసి నటనవైపు మళ్లాడు. డ్యాన్స్ షోలు చేసుకుంటూనే తనకంటూ ఒక కెరీర్ ఏర్పరచుకునే నేపత్యంలో విదేశాల్లో నటనలో శిక్షణ తీసుకున్నాడు.

తిరిగి ఇండియా వచ్చిన తర్వాత సీరియల్స్‌లో నటించి ఎంతో మంది మనసులను చూరగొన్నాడు. ఆ తర్వాత ‘కై పో చే’ సినిమా ద్వారా బాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు. సుశాంత్ కెరీర్‌కు ‘శుద్ దేశీ రొమాన్స్’ సినిమా బ్రేక్ ఇవ్వగా.. ‘ఎంఎస్ ధోనీ అన్‌టోల్డ్ స్టోరీ’ సినిమా అతడిని ఒక మంచి నటుడిగా నిలబెట్టింది.

ఇటీవలే తను నటించిన ‘చి చో రా’ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అందులో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న కొడుకులో స్పూర్తి నింపే తండ్రి పాత్రలో అద్భుతంగా నటించాడు. ఆత్మహత్య అన్నింటికీ పరిష్కారం కాదని ఆ సినిమాలో చూపించాడు. కానీ చివరకు తానే ఆత్మహత్య చేసుకోవడం పలువురిని కంటతడిపెట్టిస్తోంది.

ఇక సుశాంత్ ఆత్మహత్యపై పలువురు బాలీవుడ్ ప్రముఖులు, క్రికెటర్లు స్పందించారు. అక్షయ్ కుమార్, రీచా చడ్డా, సచిన్ టెండుల్కర్, విరట్ కొహ్లీ వంటి వారు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

First Published:  14 Jun 2020 7:38 PM GMT
Next Story