Telugu Global
National

అర్థరాత్రి బాత్‌రూంకు వెళ్లాలంటే భార్యను తోడుగా తీసుకెళ్లే వ్యక్తి నారా లోకేష్

నారా లోకేష్‌ను ప్రజలు ఎప్పుడో జీరోను చేశారని విమర్శించారు హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్. అనంతపురం జిల్లాకు వచ్చి మాట్లాడేటప్పుడు నారా లోకేష్ ఒళ్లు దగ్గర పెట్టుకోవాలన్నారు. మంగళగిరిలో ఎమ్మెల్యేగా గెలవలేని వ్యక్తి అనంతపురం వచ్చి వార్నింగ్ ఇచ్చిపోతారా అని ప్రశ్నించారు. నారా లోకేష్‌ ఒక దద్దమ్మ అని… అలాంటి వ్యక్తి జేసీ దివాకర్‌ రెడ్డికి ధైర్యం చెప్పారంటూ పత్రికల్లో రావడం చూసి చాలా బాధేసిందన్నారు. నారా లోకేష్ వద్ద ధైర్యం చెప్పించుకోవాల్సిన పరిస్థితి జేసీ […]

అర్థరాత్రి బాత్‌రూంకు వెళ్లాలంటే భార్యను తోడుగా తీసుకెళ్లే వ్యక్తి నారా లోకేష్
X

నారా లోకేష్‌ను ప్రజలు ఎప్పుడో జీరోను చేశారని విమర్శించారు హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్. అనంతపురం జిల్లాకు వచ్చి మాట్లాడేటప్పుడు నారా లోకేష్ ఒళ్లు దగ్గర పెట్టుకోవాలన్నారు.

మంగళగిరిలో ఎమ్మెల్యేగా గెలవలేని వ్యక్తి అనంతపురం వచ్చి వార్నింగ్ ఇచ్చిపోతారా అని ప్రశ్నించారు. నారా లోకేష్‌ ఒక దద్దమ్మ అని… అలాంటి వ్యక్తి జేసీ దివాకర్‌ రెడ్డికి ధైర్యం చెప్పారంటూ పత్రికల్లో రావడం చూసి చాలా బాధేసిందన్నారు. నారా లోకేష్ వద్ద ధైర్యం చెప్పించుకోవాల్సిన పరిస్థితి జేసీ దివాకర్ రెడ్డికి రావడం చూస్తే జాలేస్తోందన్నారు.

ఇంతకు ముందు జేసీని చూసి జిల్లాలో ప్రజలు భయపడేవారన్నారు. అలాంటి జేసీకి… రాత్రిపూట సుస్సు పోసుకునేందుకు ఒంటరిగా వెళ్లలేక అమ్మనాన్నను లేపే , అర్థరాత్రి బాత్‌రూంకు వెళ్లాలంటే భార్యను వెంట తీసుకెళ్లే నారా లోకేష్‌ వచ్చి ధైర్యం చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు.

23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొని… చివరకు వారికి రాజకీయ భరోసా కూడా లేకుండా చేసిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. జగన్‌మోహన్ రెడ్డికి అలాంటి అవసరం లేదన్నారు. అచ్చెన్నాయుడిని బలిపశువును చేసిన వ్యక్తులు చంద్రబాబు, నారా లోకేషేనని ఆరోపించారు. కావాల్సినంత సంపద ఉన్న జేసీ కుటుంబానికి చివరకు తప్పుడు పత్రాలు సృష్టించే చెడు ఆలోచన వచ్చిందన్నారు.

టీడీపీ నేతల అరెస్ట్‌కు నిరసనగా చంద్రబాబునాయుడు కాగడాలు పట్టుకుని తిరిగారని… ఆయన ఫోజు చూస్తుంటే పల్లెల్లో గడ్డివాములు అంటించే వ్యక్తిలా ఉన్నాడన్నారు. రాష్ట్రంలో అరాచకం సృష్టించిన వ్యక్తి చంద్రబాబునాయుడు అని విమర్శించారు. నారా లోకేష్‌ ప్రసంగాలను చిన్నపిల్లలు సెల్‌ఫోన్‌లో జోకులుగా చూసి ఆస్వాదిస్తున్నారన్నారు గోరంట్ల మాధవ్.

First Published:  16 Jun 2020 5:14 AM GMT
Next Story