Telugu Global
Cinema & Entertainment

ఇది మంచు హీరోల "మనం"

పెదరాయుడు సిల్వర్ జూబ్లీ వేడుకల్ని కరోనా/లాక్ డౌన్ కారణంగా మంచు మోహన్ బాబు మిస్సయిన సంగతి తెలిసిందే. అయితే వేడుకలు మిస్సయినా తన ఆనందాన్ని మీడియాతో షేర్ చేసుకున్నారు కలెక్షన్ కింగ్. పాతికేళ్ల నాటి పెదరాయుడు విశేషాలతో పాటు అప్ కమింగ్ మూవీ సంగతులు బయటపెట్టారు. తెలుగు తెరపై మంచో మోహన్ బాబు కనిపించి చాలా రోజులైంది. మహానటి తర్వాత మళ్లీ తెరపై కనిపించలేదు ఈ నటుడు. అలా లాంగ్ గ్యాప్ తీసుకున్న మోహన్ బాబు.. మళ్లీ […]

ఇది మంచు హీరోల మనం
X

పెదరాయుడు సిల్వర్ జూబ్లీ వేడుకల్ని కరోనా/లాక్ డౌన్ కారణంగా మంచు మోహన్ బాబు మిస్సయిన సంగతి తెలిసిందే. అయితే వేడుకలు మిస్సయినా తన ఆనందాన్ని మీడియాతో షేర్ చేసుకున్నారు కలెక్షన్ కింగ్. పాతికేళ్ల నాటి పెదరాయుడు విశేషాలతో పాటు అప్ కమింగ్ మూవీ సంగతులు బయటపెట్టారు.

తెలుగు తెరపై మంచో మోహన్ బాబు కనిపించి చాలా రోజులైంది. మహానటి తర్వాత మళ్లీ తెరపై కనిపించలేదు ఈ నటుడు. అలా లాంగ్ గ్యాప్ తీసుకున్న మోహన్ బాబు.. మళ్లీ తెలుగు సినిమాలో కనిపించేందుకు రెడీ అవుతున్నట్టు ప్రకటించారు. ఓ మంచి కుటుంబకథా చిత్రాన్ని ఎంపిక చేశానని, త్వరలోనే ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరిస్తానని చెబుతున్నారు.

ప్రస్తుతం మోహన్ బాబు తమిళ్ లో సూర్య హీరోగా సూరారై పొట్రు, మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వమ్ సినిమాలు చేస్తున్నారు. పొన్నియన్ సెల్వమ్ కంప్లీట్ అయిన వెంటనే తన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సెట్స్ పైకి వస్తుందంటున్నారు మోహన్ బాబు. అక్కినేని కుటుంబం తీసిన మనం సినిమా టైపులో ఇందులో మంచు హీరోలంతా కనిపించే ఛాన్స్ ఉంది.

First Published:  16 Jun 2020 10:29 AM GMT
Next Story