Telugu Global
NEWS

టీడీపీ కుంభకోణాలపై రంగంలోకి ఈడీ

తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన కుంభకోణాలపై ఈడీ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఈడీ అధికారులు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు. సోమవారం అమరావతి ప్రాంతంలో పర్యటించారు. నాగార్జున వర్శిటీలో సుధీర్ఘంగా అమరావతి భూములకు సంబంధించిన ఫైళ్లను పరిశీలించారు. ఏపీ సీఐడీ, సీఆర్‌డీఏ, ఏసీబీ, రెవెన్యూ అధికారులను పిలిపించుకుని వివరాలను సేకరించారు. పలు ఫైళ్ల జిరాక్స్‌లు తీసుకున్నారు. తెల్ల రేషన్ కార్డుదారులు అమరావతి ప్రాంతంలో భారీగా భూములు కొన్నారన్న విషయం ఇది వరకే సీఐడీ విచారణలో వెలుగులోకి వచ్చింది. తెలుగురాష్ట్రాలకు […]

టీడీపీ కుంభకోణాలపై రంగంలోకి ఈడీ
X

తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన కుంభకోణాలపై ఈడీ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఈడీ అధికారులు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు. సోమవారం అమరావతి ప్రాంతంలో పర్యటించారు. నాగార్జున వర్శిటీలో సుధీర్ఘంగా అమరావతి భూములకు సంబంధించిన ఫైళ్లను పరిశీలించారు. ఏపీ సీఐడీ, సీఆర్‌డీఏ, ఏసీబీ, రెవెన్యూ అధికారులను పిలిపించుకుని వివరాలను సేకరించారు. పలు ఫైళ్ల జిరాక్స్‌లు తీసుకున్నారు.

తెల్ల రేషన్ కార్డుదారులు అమరావతి ప్రాంతంలో భారీగా భూములు కొన్నారన్న విషయం ఇది వరకే సీఐడీ విచారణలో వెలుగులోకి వచ్చింది. తెలుగురాష్ట్రాలకు చెందిన 700 మంది తెల్లరేషన్ కార్డు దారులు అమరావతిలో కోట్ల రూపాయలు వెచ్చించి భూములు కొన్నారని… వాటిలో చాలా వరకు బినామీ లావాదేవీలని సీఐడీ తేల్చింది.

తమ దర్యాప్తులో వెలుగుచూసిన అక్రమాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ కు కూడా సీఐడీ లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు సోమవారం అమరావతి వచ్చారు. భూముల లావాదేవీలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు.

అమరావతి భూములకు సంబంధించిన వివరాలే కాకుండా… అగ్రిగోల్డ్ కుంభకోణానికి సంబంధించిన వివరాలను కూడా ఈడీ అధికారులు తీసుకున్నారు.

ఈఎస్‌ఐ కుంభకోణానికి సంబంధించిన వివరాలను కూడా ఆంధ్రప్రదేశ్‌ ఏసీబీ అధికారులు… ఈడీ అధికారులను కలిసి అందజేశారు. ఈఎస్‌ఐ మందుల కొనుగోలులో కేంద్రం కూడా నిధులు ఇస్తుంది కాబట్టి… ఈ కుంభకోణం వివరాలను కూడా ఈడీ అధికారులు సేకరించారు. మందుల కొనుగోళ్లలో 150 కోట్ల రూపాయలు ఎలా దారిమళ్లించారన్న దానికి సంబంధించిన వివరాలను ఈడీ అధికారులకు ఏసీబీ అధికారులు అందజేశారు.

First Published:  15 Jun 2020 11:27 PM GMT
Next Story