Telugu Global
NEWS

తొడకొట్టిన మంత్రి అనిల్

మండలిలో అధికార, విపక్ష పార్టీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. మంత్రి అనిల్ కుమార్‌ యాదవ్, టీడీపీ ఎమ్మెల్యే నాగజగదీశ్వరరావు ఇద్దరూ ఒకరిపై ఒకరు దూసుకెళ్లారు. దాంతో మంత్రి అనిల్‌ను మరో మంత్రి అవంతి శ్రీనివాస్‌ నిలువరించారు. టీడీపీ ఎమ్మెల్సీ నాగజగదీశ్వర్‌ను టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి అదుపు చేశారు. ఇరు పక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. అచ్చెన్నాయుడు అరెస్ట్ అక్రమమని టీడీపీ ఎమ్మెల్సీ నాగజగదీశ్వర్ అభ్యంతరం తెలపడంతో వివాదం మొదలైంది. దొంగతనం చేశారు […]

తొడకొట్టిన మంత్రి అనిల్
X

మండలిలో అధికార, విపక్ష పార్టీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. మంత్రి అనిల్ కుమార్‌ యాదవ్, టీడీపీ ఎమ్మెల్యే నాగజగదీశ్వరరావు ఇద్దరూ ఒకరిపై ఒకరు దూసుకెళ్లారు. దాంతో మంత్రి అనిల్‌ను మరో మంత్రి అవంతి శ్రీనివాస్‌ నిలువరించారు. టీడీపీ ఎమ్మెల్సీ నాగజగదీశ్వర్‌ను టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి అదుపు చేశారు.

ఇరు పక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. అచ్చెన్నాయుడు అరెస్ట్ అక్రమమని టీడీపీ ఎమ్మెల్సీ నాగజగదీశ్వర్ అభ్యంతరం తెలపడంతో వివాదం మొదలైంది. దొంగతనం చేశారు కాబట్టే అచ్చెన్నాయుడు అరెస్ట్ అయ్యారని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కౌంటర్ ఇచ్చారు. నాగజగదీశ్వర్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో మంత్రి అనిల్ జోక్యం చేసుకున్నారు.

బీసీ అయినంత మాత్రాన అచ్చెన్నాయుడు తప్పు చేసినా వదిలేయాలా అని ప్రశ్నించారు. చట్టం అందరికీ సమానమేనన్నారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తనపై తప్పుడు కేసులు పెట్టేందుకు ప్రయత్నించారని… కానీ ఒక్క నేరాన్ని కూడా నిరూపించలేకపోయారని అనిల్ వ్యాఖ్యానించారు. నిజాయితీగా తట్టుకుని నిలబడ్డామన్నారు. నెల్లూరులో తనను ఓడించేందుకు కోట్లు ఖర్చు పెట్టారని.. కానీ గెలిచి వచ్చానని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తొడకొట్టారు.

ఇంతలో టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌ రెడ్డి మంత్రులు గడ్డాలు పెంచారంటూ… రౌడీలు అని వ్యాఖ్యానించారు. ఇందుకు మంత్రి అనిల్ మరింత తీవ్రంగా స్పందించారు. గడ్డాలు పెంచితే రౌడీలు అయిపోతారా అని నిలదీశారు. అలాగైతే చైర్మన్ షరీఫ్‌కు, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడికి కూడా గడ్డం ఉందని… వారు కూడా రౌడీలేనా అని మంత్రి కౌంటర్ ఇచ్చారు.

మునులు, రుషులు గడ్డాలు పెంచారని… వాళ్లను కూడా రౌడీలు అంటారా అని టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డిని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ప్రశ్నించారు. ఇలా అధికార ప్రతిపక్షం మధ్య వాగ్వాదం పెరగడం, అనిల్, నాగజగదీశ్వర్ ఒకరిపై ఒకరు దూసుకెళ్లడంతో చైర్మన్ సభను కాసేపు వాయిదా వేసి వెళ్లిపోయారు.

First Published:  17 Jun 2020 6:55 AM GMT
Next Story