Telugu Global
Cinema & Entertainment

మెగా డాటర్ మ్యారేజ్ ఫిక్స్

మెగా కాంపౌండ్ లో త్వరలోనే పెళ్లి బాజా మోగనుంది. నాగబాబు కూతురు కొణిదెల నిహారికకు త్వరలోనే పెళ్లి జరగబోతోంది. ఇది పుకారు కాదు. నిజం. దశలవారీగా పరోక్షంగా ఈ విషయాన్ని స్వయంగా నిహారిక బయటపెడుతోంది. ముందుగా ఓ కాఫీ కప్పు ఫొటో పెట్టి.. దానిపై మిస్ నిహా అని రాసి ఉన్న స్థానంలో మిస్ అనే పదాన్ని కొట్టేసి మిసెస్ అని రాసిపెట్టింది. అప్పుడే చాలామందికి మేటర్ అర్థమైపోయింది. ఇది జరిగిన కొన్ని గంటలకే తనకు కాబోయే […]

మెగా డాటర్ మ్యారేజ్ ఫిక్స్
X

మెగా కాంపౌండ్ లో త్వరలోనే పెళ్లి బాజా మోగనుంది. నాగబాబు కూతురు కొణిదెల నిహారికకు త్వరలోనే పెళ్లి జరగబోతోంది. ఇది పుకారు కాదు. నిజం. దశలవారీగా పరోక్షంగా ఈ విషయాన్ని స్వయంగా నిహారిక బయటపెడుతోంది.

ముందుగా ఓ కాఫీ కప్పు ఫొటో పెట్టి.. దానిపై మిస్ నిహా అని రాసి ఉన్న స్థానంలో మిస్ అనే పదాన్ని కొట్టేసి మిసెస్ అని రాసిపెట్టింది. అప్పుడే చాలామందికి మేటర్ అర్థమైపోయింది. ఇది జరిగిన కొన్ని గంటలకే తనకు కాబోయే భర్తను గట్టిగా కౌగిలించుకున్న ఫొటోను రిలీజ్ చేసింది.

కాకపోతే ఆ ఫొటోలో నిహారికకు కాబోయే భర్త ముఖం కనిపించలేదు. కావాలనే ఇలా ఓ ఫొటోను రిలీజ్ చేసింది నిహారిక. గుంటూరు జిల్లాలో ఓ పెద్ద కుటుంబానికి చెందిన వ్యక్తిని నిహారిక పెళ్లాడబోతోంది. వీళ్లిద్దరికీ నిశ్చితార్థం కూడా పూర్తయిందనే టాక్ నడుస్తోంది.

నిహారికకు వచ్చే ఏడాది పెళ్లి చేసేస్తామని నాగబాబు ఇప్పటికే ప్రకటించారు. చెప్పినట్టుగానే ఆమెకు ఓ మంచి సంబంధం చూసిపెట్టారు. త్వరలోనే నిహారిక పెళ్లికి సంబంధించి నాగబాబు అధికారికంగా ప్రకటన చేయబోతున్నారు.

First Published:  18 Jun 2020 11:12 AM GMT
Next Story