Telugu Global
National

ముంబైలో మిగిలింది ఒకే ఐసీయూ, 11 వెంటిలేటర్లు

దేశంలో అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని ముంబైలో కరోనా వైరస్ నియంత్రణ వ్యాప్తికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. పాజిటివ్ కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ అత్యధిక మందిని హోం ఐసోలేషన్, క్వారంటైన్‌లో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. కానీ, దేశంలోనే అత్యధికంగా ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య ముంబైలోనే ఉండటం గమనార్హం. ముంబైలో కొవిడ్-19 రోగుల్లో అత్యధికంగా 32.5 శాతం మంది ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఢిల్లీలో 21.8 శాతం మంది, చెన్నైలో 27 […]

ముంబైలో మిగిలింది ఒకే ఐసీయూ, 11 వెంటిలేటర్లు
X

దేశంలో అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని ముంబైలో కరోనా వైరస్ నియంత్రణ వ్యాప్తికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. పాజిటివ్ కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ అత్యధిక మందిని హోం ఐసోలేషన్, క్వారంటైన్‌లో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. కానీ, దేశంలోనే అత్యధికంగా ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య ముంబైలోనే ఉండటం గమనార్హం.

ముంబైలో కొవిడ్-19 రోగుల్లో అత్యధికంగా 32.5 శాతం మంది ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఢిల్లీలో 21.8 శాతం మంది, చెన్నైలో 27 శాతం మంది ఆసుపత్రిపాలవుతున్నారు. ముంబైలో రోజుకు 1000 మంది దాకా కోలుకుంటున్నా.. ఆసుపత్రిలో చేరే వాళ్లు అంతకంటే ఎక్కువే ఉన్నారు. దీంతో ఆసుపత్రుల్లో బెడ్లు ఖాళీ లేకుండా పోయాయి.

ముంబైలో కొవిడ్-19కి చికిత్స అందిస్తున్న ఆసుపత్రుల్లో 98 శాతం రోగులతో నిండిపోయాయి. ప్రస్తుతం అక్కడ ఒక్క ఐసీయూ బెడ్ మాత్రమే ఖాళీ ఉండగా, 11 వెంటిలేటర్లు ఖాళీగా ఉన్నాయి. ఒకవేళ ఇప్పుడు హైరిస్క్ రోగులు ఎవరైనా చేరితే వారికి వైద్యం అందించడం కష్టమే. ముంబైలో గత నెల కరోనా వైరస్ సోకిన వాళ్లు 2.8 రెట్లు పెరగ్గా.. ఆసుపత్రిలో బెడ్ల సంఖ్య మాత్రం 1.8 రెట్లు మాత్రమే పెరిగాయి. దీంతో రోగులకు చికిత్స అందించే సౌకర్యలు తగ్గిపోవడంతో గత నెలలో 2.8 రెట్లు మరణాల సంఖ్య పెరిగింది.

First Published:  18 Jun 2020 8:47 AM GMT
Next Story