Telugu Global
National

కర్నల్ కుటుంబానికి రూ. 5 కోట్లు ప్రకటించిన కేసీఆర్

భార్యకు గ్రూప్ – 1 జాబ్ మిగతా సైనికుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఇండో-చైనా సరిహద్దు వాస్తవాధీన రేఖ సమీపంలోని గల్వాన్ లోయ వద్ద జరిగిన ఘర్షణల్లో కర్నల్ సంతోష్ బాబు సహా మరో 19 మంది సైనికులు మృతి చెందిన సంగతి తెలిసిందే. తెలంగాణలోని సూర్యపేటకు చెందిన కర్నల్ సంతోష్ బాబు కుటుంబానికి సీఎం కేసీఆర్ అండగా ఉంటానని ప్రకటించారు. ఆయన చేసిన త్యాగానికి మనం ఎంత చేసినా తక్కువేనని అన్నారు. సంతోష్ బాబు కుటుంబానికి రూ. 5 […]

కర్నల్ కుటుంబానికి రూ. 5 కోట్లు ప్రకటించిన కేసీఆర్
X
  • భార్యకు గ్రూప్ – 1 జాబ్
  • మిగతా సైనికుల కుటుంబాలకు రూ. 10 లక్షలు

ఇండో-చైనా సరిహద్దు వాస్తవాధీన రేఖ సమీపంలోని గల్వాన్ లోయ వద్ద జరిగిన ఘర్షణల్లో కర్నల్ సంతోష్ బాబు సహా మరో 19 మంది సైనికులు మృతి చెందిన సంగతి తెలిసిందే.

తెలంగాణలోని సూర్యపేటకు చెందిన కర్నల్ సంతోష్ బాబు కుటుంబానికి సీఎం కేసీఆర్ అండగా ఉంటానని ప్రకటించారు. ఆయన చేసిన త్యాగానికి మనం ఎంత చేసినా తక్కువేనని అన్నారు.

సంతోష్ బాబు కుటుంబానికి రూ. 5 కోట్ల ఎక్స్‌గ్రేషియాతో పాటు ఇంటి స్థలం, ఆయన భార్యకు గ్రూప్-1 స్థాయి ఉద్యోగం ఇవ్వనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఈ సాయాన్ని తాను స్వయంగా సంతోష్ బాబు నివాసానికి వెళ్లి వాళ్ల కుటుంబసభ్యులకు అందిస్తానని పేర్కొన్నారు. ఇదే ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 19 మంది సైనికుల కుటుంబాలకు తలా రూ. 10 లక్షల చొప్పున అందిస్తామని.. దీన్ని కేంద్ర రక్షణ మంత్రి ద్వారా వారికి అందేలా చూస్తామని చెప్పారు.

సైనికులు ఇలాంటి ఘటనల్లో మరణిస్తే కేంద్ర ప్రభుత్వం ఎలాగూ అండగా నిలుస్తుంది. కానీ వారి కుటుంబాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తోడుగా ఉండి భరోసా ఇవ్వడం ముఖ్యమని కేసీఆర్ చెప్పారు. కరోనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా సరే.. ఖర్చులు తగ్గించుకొని సైనికుల సంక్షేమానికి పాటుపడతామని కేసీఆర్ చెప్పారు. శుక్రవారం మోడీ ఆధ్వర్యంలో జరిగిన అఖిల పక్ష సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు.

First Published:  19 Jun 2020 10:52 AM GMT
Next Story