Telugu Global
Cinema & Entertainment

నిర్మాతగా మారబోతున్న హరీష్

దర్శకులు నిర్మాతలుగా మారడం కొత్తేంకాదు. పూరి జగన్నాధ్, సంపత్ నంది లాంటి ఎంతోమంది దర్శకులు నిర్మాతలుగా మారారు. ఇప్పుడీ లిస్ట్ లోకి హరీష్ శంకర్ కూడా చేరిపోయాడు. త్వరలోనే తన నిర్మాణంలో ఓ సినిమా చేయబోతున్నాడు హరీష్. దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయింది. మరో నిర్మాత మహేష్ కోనేరుతో కలిసి నిర్మాణ సంస్థ ప్రారంభించబోతున్నాడు హరీష్. ఈ బ్యానర్ పై మంచి కాన్సెప్ట్ లో లో-బడ్జెట్ సినిమాలు తీయాలనేది వీళ్ల ప్లాన్. ఇందులో భాగంగా […]

నిర్మాతగా మారబోతున్న హరీష్
X

దర్శకులు నిర్మాతలుగా మారడం కొత్తేంకాదు. పూరి జగన్నాధ్, సంపత్ నంది లాంటి ఎంతోమంది దర్శకులు నిర్మాతలుగా మారారు. ఇప్పుడీ లిస్ట్ లోకి హరీష్ శంకర్ కూడా చేరిపోయాడు. త్వరలోనే తన నిర్మాణంలో ఓ సినిమా చేయబోతున్నాడు హరీష్. దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయింది.

మరో నిర్మాత మహేష్ కోనేరుతో కలిసి నిర్మాణ సంస్థ ప్రారంభించబోతున్నాడు హరీష్. ఈ బ్యానర్ పై మంచి కాన్సెప్ట్ లో లో-బడ్జెట్ సినిమాలు తీయాలనేది వీళ్ల ప్లాన్. ఇందులో భాగంగా తొలి అవకాశాన్ని ప్రణీత్ కు ఇచ్చారు.

గతంలో ఇతడు కొణెదల నిహారిక హీరోయిన్ గా సూర్యకాంతం అనే సినిమా చేశాడు. ఈసారి ఓ క్రైమ్ కామెడీ కథ రాసుకున్నాడు. ఇతడికి తమ బ్యానర్ లో తొలి అవకాశం ఇచ్చాడు హరీష్. కరోనా పరిస్థితులన్నీ సర్దుకున్న తర్వాత బ్యానర్ ను, సినిమాను అఫీషియల్ గా ప్రకటించి వెంటనే సెట్స్ పైకి వెళ్తారు.

First Published:  19 Jun 2020 11:04 AM GMT
Next Story