Telugu Global
NEWS

ఏపీలోని మూడు పట్టణాల్లో మళ్లీ లాక్‌డౌన్

కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ప్రజలు చేస్తున్న చిన్న చిన్న పొరపాట్ల కారణంగా అది మరింతగా వ్యాపిస్తోంది. లాక్‌డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత వైరస్ వ్యాప్తి పెరిగిపోయింది. గుంపులుగా ఉండొద్దని, సమావేశాలు, ఫంక్షన్లు నిర్వహించవద్దని ప్రభుత్వం చెప్పినా మాట వినడం లేదు. దీంతో మళ్లీ లాక్‌డౌన్ విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏపీలోని మూడు జిల్లాల్లో లాక్‌డౌన్ విధించడానికి రంగం సిద్దం చేసింది. జూన్ 21 నుంచి నిర్థారిత ప్రాంతాల్లో సంపూర్ణ లాక్‌డౌన్ అమలు […]

ఏపీలోని మూడు పట్టణాల్లో మళ్లీ లాక్‌డౌన్
X

కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ప్రజలు చేస్తున్న చిన్న చిన్న పొరపాట్ల కారణంగా అది మరింతగా వ్యాపిస్తోంది. లాక్‌డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత వైరస్ వ్యాప్తి పెరిగిపోయింది. గుంపులుగా ఉండొద్దని, సమావేశాలు, ఫంక్షన్లు నిర్వహించవద్దని ప్రభుత్వం చెప్పినా మాట వినడం లేదు. దీంతో మళ్లీ లాక్‌డౌన్ విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఏపీలోని మూడు జిల్లాల్లో లాక్‌డౌన్ విధించడానికి రంగం సిద్దం చేసింది. జూన్ 21 నుంచి నిర్థారిత ప్రాంతాల్లో సంపూర్ణ లాక్‌డౌన్ అమలు కానుంది. ప్రకాశం, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో ఈ లాక్‌డౌన్ అమలులో ఉంటుంది. ప్రకాశం జిల్లాలో ఇటీవల కేసులు బాగా పెరుగుతున్న ఒంగోలు, చీరాల పట్టణాల్లో సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు.

శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం మొత్తం లాక్‌డౌన్ అమలు కానుంది. ఇటీవల పలాసలో జరిగిన ఒక సంస్మరణ కార్యక్రమానికి 200 మంది హాజరయ్యారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అతనికి పరీక్షలు నిర్వహించగా కోవిడ్-19గా నిర్థారణ అయ్యింది. దీంతో పలాస, కాశీబుగ్గ ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి.. నియోజకవర్గం మొత్తం లాక్‌డౌన్ విధించారు.

మరోవైపు తాడిపత్రి, యాడికి, పామిడి, హిందూపురం, గుంతకల్లు పట్టణాల్లో సంపూర్ణ లాక్‌డౌన్ విధించనున్నారు. అనంతపురం కార్పొరేషన్ పరిధిలో కూడా ఉదయం 6 నుంచి 11 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరవాలని అధికారులు ఆదేశించారు. ఉదయం 11 తర్వాత ఎవరూ రోడ్లపైకి రావొద్దని అధికారులు చెప్పారు.

First Published:  20 Jun 2020 2:45 AM GMT
Next Story