Telugu Global
Cinema & Entertainment

నాగబాబు ఇలా చేశాడేంటబ్బా!

ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమంతో బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు నాగబాబు. ఆయనకు క్రేజ్ రావడంతో పాటు డబ్బు కూడా బాగానే వచ్చింది. అయితే మల్లెమాల మేనేజ్ మెంట్ తో ఆయనకు చెడింది. దీంతో జీ తెలుగును ఆశ్రయించారు. మరింత ఎక్కువ ప్యాకేజీకి ‘అదిరింది’ అనే కార్యక్రమం సెట్ చేసుకున్నారు. జబర్దస్త్ నుంచి కొంతమందిని జీ తెలుగు వైపు లాక్కెళ్లారు కూడా. ఇక అంతా ఓకే అనుకున్న టైమ్ లో ఇప్పుడు జీ తెలుగు ఛానెల్ కు కూడా […]

నాగబాబు ఇలా చేశాడేంటబ్బా!
X

ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమంతో బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు నాగబాబు. ఆయనకు క్రేజ్ రావడంతో పాటు డబ్బు కూడా బాగానే వచ్చింది. అయితే మల్లెమాల మేనేజ్ మెంట్ తో ఆయనకు చెడింది. దీంతో జీ తెలుగును ఆశ్రయించారు. మరింత ఎక్కువ ప్యాకేజీకి ‘అదిరింది’ అనే కార్యక్రమం సెట్ చేసుకున్నారు. జబర్దస్త్ నుంచి కొంతమందిని జీ తెలుగు వైపు లాక్కెళ్లారు కూడా.

ఇక అంతా ఓకే అనుకున్న టైమ్ లో ఇప్పుడు జీ తెలుగు ఛానెల్ కు కూడా ఝలక్ ఇచ్చారు నాగబాబు. ఈసారి ఏకంగా సొంత కుంపటి పెట్టారు. తనే కొత్తగా ఓ అల్టిమేట్ కామెడీ షో ప్రారంభించబోతున్నట్టు ప్రకటించారు నాగబాబు. దీనికి సంబంధించి ఔత్సాహిక నటీనటులు, స్క్రిప్ట్ రైటర్లు తనను సంప్రదించవచ్చంటూ ఓ వాట్సాప్ నంబర్ కూడా ఇచ్చారు.

నాగబాబు చేసిన ఈ పనికి జీ తెలుగు అవాక్కైంది. తమ సంస్థకు చెందిన ‘అదిరింది’ అనే కార్యక్రమాన్ని నాగబాబు నిలబెడతారని, జబర్దస్త్ కు పోటీగా తీసుకొస్తారని ఆ సంస్థ భావిస్తే.. నాగబాబు ఇలా సొంత కుంపటి పెట్టడంతో జీ తెలుగు యాజమాన్యం ఇబ్బంది పడుతోంది.

నిజానికి అదిరింది అనే కార్యక్రమంతో కొత్త టాలెంట్ పరిచయమైంది. వాళ్లు ప్రేక్షకుల్ని బాగానే నవ్విస్తున్నారు. అదే ఊపులో మరింత మందిని నాగబాబు పరిచయం చేస్తారని యాజమాన్యం ఓవైపు భావిస్తుంటే.. మరోవైపు ఆయనిలా తనకుతానుగా ఓ కామెడీ షో ప్రకటించి షాకిచ్చారు.

First Published:  20 Jun 2020 4:00 AM GMT
Next Story