Telugu Global
Cinema & Entertainment

గుండుతో నటిస్తానంటున్న హీరోయిన్

మనసుకు నచ్చిన మంచి పాత్ర దొరికితే, అందులో క్యారెక్టర్ కు తగ్గట్టు గుండు కొట్టించుకోవాల్సి వస్తే, అలా చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదంటోంది హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. టాలీవుడ్ లో మోస్ట్ హాట్ గా పేరుతెచ్చుకున్న ఈ అమ్మడు.. క్యారెక్టర్ బాగుంటే తన గ్లామర్ ను త్యాగం చేయడానికి కూడా వెనుకాడనని చెబుతోంది. రాత్రి నిద్రపట్టక నెట్ లో ఛాటింగ్ మొదలుపెట్టింది పాయల్. ఎవరైనా లైన్లో ఉంటే ప్రశ్నలు అడగండంటూ ఊరించింది. చాలా […]

గుండుతో నటిస్తానంటున్న హీరోయిన్
X

మనసుకు నచ్చిన మంచి పాత్ర దొరికితే, అందులో క్యారెక్టర్ కు తగ్గట్టు గుండు కొట్టించుకోవాల్సి వస్తే, అలా చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదంటోంది హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. టాలీవుడ్ లో మోస్ట్ హాట్ గా పేరుతెచ్చుకున్న ఈ అమ్మడు.. క్యారెక్టర్ బాగుంటే తన గ్లామర్ ను త్యాగం చేయడానికి కూడా వెనుకాడనని చెబుతోంది.

రాత్రి నిద్రపట్టక నెట్ లో ఛాటింగ్ మొదలుపెట్టింది పాయల్. ఎవరైనా లైన్లో ఉంటే ప్రశ్నలు అడగండంటూ ఊరించింది. చాలా ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. ఇందులో భాగంగా మంచి పాత్ర దొరికితే గుండు చేయించుకోవడానికి కూడా రెడీ అని, ఇందులో మరో ఆలోచనకు తావులేదని కూడా స్పష్టంచేసింది.

ఆర్ఎక్స్100తో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ, ఆ సినిమాలో నెగెటివ్ షేడ్స్ లో కనిపించింది. మళ్లీ అలాంటి క్యారెక్టర్ చేసే ఉద్దేశం ఉందా అనే ప్రశ్నకు పాయల్ స్పందించింది. త్వరలోనే పూర్తిస్థాయి విలన్ పాత్రలో కనిపించబోతున్నానంటూ ప్రకటించింది.

First Published:  20 Jun 2020 7:22 AM GMT
Next Story