Telugu Global
Cinema & Entertainment

విజయ్ దేవరకొండ సినిమాపై క్లారిటీ

లెక్కప్రకారం విజయ్ దేవరకొండ సినిమాను ముంబయిలోనే షూట్ చేయాలి. మరికొంత భాగం విదేశాల్లో కూడా చేయాల్సి ఉంది. కానీ లాక్ డౌన్ పడింది. విదేశాలకు వెళ్లే మాట అటుంచి, కనీసం ముంబయి వెళ్లి షూట్ చేసే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే మహారాష్ట్రలో, మరీ ముఖ్యంగా దేశవాణిజ్య రాజధాని ముంబయిలో కరోనా మరణమృదంగం వాయిస్తోంది. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండతో చేస్తున్న సినిమాకు స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ముంబయిలో ఆల్రెడీ కొంత […]

విజయ్ దేవరకొండ సినిమాపై క్లారిటీ
X

లెక్కప్రకారం విజయ్ దేవరకొండ సినిమాను ముంబయిలోనే షూట్ చేయాలి. మరికొంత భాగం విదేశాల్లో కూడా చేయాల్సి ఉంది. కానీ లాక్ డౌన్ పడింది. విదేశాలకు వెళ్లే మాట అటుంచి, కనీసం ముంబయి వెళ్లి షూట్ చేసే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే మహారాష్ట్రలో, మరీ ముఖ్యంగా దేశవాణిజ్య రాజధాని ముంబయిలో కరోనా మరణమృదంగం వాయిస్తోంది. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండతో చేస్తున్న సినిమాకు స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేసినట్టు ప్రచారం జరుగుతోంది.

ముంబయిలో ఆల్రెడీ కొంత షూటింగ్ చేశారు. మిగతా భాగాన్ని ముంబయిలో షూట్ చేయడానికి యూనిట్ కు ఇష్టం లేదు. అందుకే స్క్రిప్ట్ లో ఈ మేరకు మార్పులు చేశారంటూ కథనాలు వచ్చాయి. అయితే వీటిని యూనిట్ ఖండించింది. లాక్ డౌన్ వల్ల విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా స్క్రిప్ట్ లో మార్పులు చేశారంటూ జరుగుతున్న ప్రచారాన్ని నిర్మాత చార్మి ఖండించింది. అలాంటిదేం లేదని స్పష్టంచేసింది.

మరోవైపు సినిమా టైటిల్ పై కూడా రియాక్ట్ అయింది చార్మి. లైగర్ అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించిన మాట వాస్తవమేనని, కానీ అదే టైటిల్ ను ఫిక్స్ చేస్తామనే గ్యారెంటీ లేదంటోంది. త్వరలోనే విజయ్ దేవరకొండ కొత్త సినిమా టైటిల్ ను ప్రకటిస్తామని స్పష్టంచేసింది. అనన్య పాండే ఈ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయమౌతోంది.

First Published:  20 Jun 2020 10:26 AM GMT
Next Story