Telugu Global
Cinema & Entertainment

ఇండస్ట్రీకి మరో స్వీటీ వచ్చింది

స్వీటీ పేరు చెప్పగానే అందరికీ అనుష్క గుర్తొస్తుంది. ఎఁదుకంటే ఆమె అసలు పేరు అదే. సిల్వర్ స్క్రీన్ పై స్వీటీ అనే పేరు బాగుండదని తన స్క్రీన్ నేమ్ ను అనుష్కగా మార్చుకుంది. ఇప్పుడీ స్వీటీ పేరును మరో పిల్ల పెట్టేసుకుంది. అవును.. ఈ వెండితెర స్వీటీని రామ్ గోపాల్ వర్మ పరిచయం చేస్తున్నాడు. ఈనెల 27న వెబ్ లో మరో సినిమా రిలీజ్ చేయబోతున్నాడు వర్మ. దాని పేరు నగ్నం. ఇందులో హీరోయిన్ గా నటించిన […]

ఇండస్ట్రీకి మరో స్వీటీ వచ్చింది
X

స్వీటీ పేరు చెప్పగానే అందరికీ అనుష్క గుర్తొస్తుంది. ఎఁదుకంటే ఆమె అసలు పేరు అదే. సిల్వర్ స్క్రీన్ పై స్వీటీ అనే పేరు బాగుండదని తన స్క్రీన్ నేమ్ ను అనుష్కగా మార్చుకుంది. ఇప్పుడీ స్వీటీ పేరును మరో పిల్ల పెట్టేసుకుంది. అవును.. ఈ వెండితెర స్వీటీని రామ్ గోపాల్ వర్మ పరిచయం చేస్తున్నాడు.

ఈనెల 27న వెబ్ లో మరో సినిమా రిలీజ్ చేయబోతున్నాడు వర్మ. దాని పేరు నగ్నం. ఇందులో హీరోయిన్ గా నటించిన అమ్మాయి పేరు స్వీటీ. అసలు పేరు ఏదో ఉంది కానీ స్క్రీన్ నేమ్ ను స్వీటీగా మార్చాడు వర్మ. ఈమెది పశ్చిమగోదావరి జిల్లా. అచ్చ తెలుగు అమ్మాయి.

నగ్నం సినిమాలో టైటిల్ కు తగ్గట్టు చాలా చోట్ల నగ్నంగా నటించింది స్వీటీ. ట్రయిలర్ లో ఇప్పటికే చాలా మసాలా చూపించిన వర్మ.. తాజాగా స్వీటీ ఫొటోల్ని రిలీజ్ చేశాడు. అవి కూడా హాట్ గా ఉండడంతో వైరల్ అయ్యాయి.

మొత్తమ్మీద క్లైమాక్స్ సినిమాలో మియా మాల్కోవాతో విచ్చలవిడిగా అందాలు ఆరబోయించిన వర్మ.. ఈసారి మరికొంచెం దిగజారి ఏకంగా నగ్నం అనే బూతు సినిమానే తెరకెక్కించాడు. స్వీటీని సెక్సీగా ప్రజెంట్ చేస్తున్నాడు. క్లైమాక్స్ కు వంద రూపాయలు ఫిక్స్ చేసిన వర్మ.. నగ్నం సినిమాకు 200 రూపాయల టిక్కెట్ రేటు ఫిక్స్ చేశాడు.

First Published:  21 Jun 2020 7:17 AM GMT
Next Story