Telugu Global
NEWS

వైసీపీలో ఆ ఇద్దరు అదృష్టవంతులెవరు ?

రాజ్యసభ ఎన్నికలు ముగిశాయి. వైసీపీ నుంచి నలుగురు సభ్యులు ఎన్నికయ్యారు. మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లిసుభాష్‌ చంద్రబోస్‌ పెద్దల సభలో అడుగుపెట్టబోతున్నారు. రాష్ట్ర రాజకీయాల నుంచి హస్తినకు వీరు షిప్ట్‌ కాబోతున్నారు. వీరు ఇద్దరు ప్రస్తుతం ఎమ్మెల్సీలు. రాజ్యసభకు ఎన్నికైన తర్వాత వీరు ఎమ్మెల్సీ పదవికి ఆరు నెలల్లోపు రాజీనామా చేయాల్సి ఉంటుంది. దాంతో పాటు మంత్రి పదవి కూడా వదులుకోవాల్సి ఉంటుంది. దీంతో ఈ ఇద్దరు రాజీనామాతో ఖాళీ అయ్యే సీట్ల కోసం చాలా మంది […]

వైసీపీలో ఆ ఇద్దరు అదృష్టవంతులెవరు ?
X

రాజ్యసభ ఎన్నికలు ముగిశాయి. వైసీపీ నుంచి నలుగురు సభ్యులు ఎన్నికయ్యారు. మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లిసుభాష్‌ చంద్రబోస్‌ పెద్దల సభలో అడుగుపెట్టబోతున్నారు. రాష్ట్ర రాజకీయాల నుంచి హస్తినకు వీరు షిప్ట్‌ కాబోతున్నారు. వీరు ఇద్దరు ప్రస్తుతం ఎమ్మెల్సీలు.

రాజ్యసభకు ఎన్నికైన తర్వాత వీరు ఎమ్మెల్సీ పదవికి ఆరు నెలల్లోపు రాజీనామా చేయాల్సి ఉంటుంది. దాంతో పాటు మంత్రి పదవి కూడా వదులుకోవాల్సి ఉంటుంది. దీంతో ఈ ఇద్దరు రాజీనామాతో ఖాళీ అయ్యే సీట్ల కోసం చాలా మంది వెయిటింగ్‌లో ఉన్నారు.

మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్‌ ఇద్దరూ బీసీ నేతలే. దీంతో ఈ రెండు మంత్రి పదవులు కూడా తిరిగి బీసీకి ఇస్తారా? లేక పోతే మార్పులు ఉంటాయా? అనేది తెలియాల్సి ఉంది.

అయితే బీసీ కోటాలో ఇప్పటికే ముమ్మిడివరం ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌ ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాకే మంత్రి పదవి ఇస్తే ఈయనకు అవకాశం వస్తుందని అంటున్నారు. ఒక వేళ మత్స్యకార కోటాలో ఇస్తే పలాస ఎమ్మెల్యే అప్పలరాజు కూడా వెయిటింగ్‌లో ఉన్నారు. అయితే ఫస్ట్‌ టైమ్‌ ఎమ్మెల్యే కావడంతో చాన్స్‌ తక్కువ.

గుంటూరు నుంచి మంత్రి పదవుల కోసం సత్తెనపల్లి నుంచి అంబటి రాంబాబు, మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే వేచి చూస్తున్నారు. అయితే ఆర్కే బంధువుకు రాజ్యసభ ఇవ్వడంతో ఈయనకు మంత్రి పదవి దక్కేది కష్టం. ఒకవేళ మహిళా కోటాలో ఇస్తే చిలుకలూరిపేట ఎమ్మెల్యే రజనీకి ఇవ్వొచ్చు అని ప్రచారం జరుగుతోంది. ఈమె కూడా ఫస్ట్‌ టైమ్‌ ఎమ్మెల్యే కావడం మైనస్‌.

అయితే రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గాన్ని మారుస్తానని ప్రమాణస్వీకారానికి ముందే సీఎం జగన్‌ చెప్పారు. ఏడాది గడిచింది. ఇంకో ఏడాదిన్నర టైమ్‌ ఉంది. ఈ లోపు మంత్రివర్గ విస్తరణ చేస్తారా? అనేది ఓ డౌట్. లేకపోతే పనితీరు మార్చుకోని మంత్రులను మార్చి… ఒకేసారి పునర్‌వ్యవస్థీకరణ అనేది చూడాలి. మొత్తానికి ఏపీలో ఆ ఇద్దరు అదృష్టవంతులెవరు? అనే చర్చ మొదలైంది.

First Published:  20 Jun 2020 9:36 PM GMT
Next Story