Telugu Global
National

రోజుకు 30వేల పరీక్షలు చేసే దిశగా ఏపీ

కరోనా పరీక్షలు అత్యధికంగా నిర్వహిస్తున్న రాష్ట్రాల్లో అగ్రగామిగా ఉంటున్న ఆంధ్రప్రదేశ్‌… పరీక్షల సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే సగటున ప్రతి పదిలక్షల మందికి 12వేల 600 పరీక్షలు నిర్వహించారు. 90 టెస్టుల సామర్ధ్యంతో మొదలుపెట్టి 24వేల టెస్టులు చేసే స్థాయికి వచ్చామని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి వెల్లడించారు. పరీక్షల సామర్ధ్యాన్ని రోజుకు 30వేలకు పెంచే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 6.76 లక్షలకు పైగా […]

రోజుకు 30వేల పరీక్షలు చేసే దిశగా ఏపీ
X

కరోనా పరీక్షలు అత్యధికంగా నిర్వహిస్తున్న రాష్ట్రాల్లో అగ్రగామిగా ఉంటున్న ఆంధ్రప్రదేశ్‌… పరీక్షల సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే సగటున ప్రతి పదిలక్షల మందికి 12వేల 600 పరీక్షలు నిర్వహించారు. 90 టెస్టుల సామర్ధ్యంతో మొదలుపెట్టి 24వేల టెస్టులు చేసే స్థాయికి వచ్చామని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి వెల్లడించారు. పరీక్షల సామర్ధ్యాన్ని రోజుకు 30వేలకు పెంచే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టు వివరించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 6.76 లక్షలకు పైగా టెస్టులు చేశామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకు 22 వేల కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని… దీన్ని 30 వేలకు పెంచుతామన్నారు. పరీక్షలకు రోజుకు రూ.2 కోట్ల వరకు ఖర్చు పెడుతోంది ఏపీ ప్రభుత్వం. 40 వేల మందికి ఏకకాలంలో వైద్యం అందించేలా పడకలు సిద్ధం చేశారు. ఇందులో 20 వేల వరకు ఆక్సిజన్‌ పడకలే ఉన్నాయి.

కరోనా తీవ్రత తక్కువగా ఉన్న కేసులకు ఇంట్లోనే వైద్యం చేసేలా వైద్యులు చర్యలు తీసుకుంటారని జవహర్ రెడ్డి వెల్లడించారు. ఇలాంటి వాళ్లు 80 శాతం మంది ఉంటారని…. తీవ్రత ఎక్కువ ఉంటేనే ఆస్పత్రికి పంపుతామన్నారు. రాష్ట్రంలో ఉన్న 20 వేల మందికి పైగా వైద్యులతో పాటు, మరో 24 వేల మంది హౌస్‌ సర్జన్‌ చేస్తున్న వారు, పీజీ చదువుతున్నవారు, స్టాఫ్‌నర్సుల సేవలను వినియోగించుకుంటున్నట్లు వివరించారు.

కరోనా వైరస్‌ నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకున్న మొదటి మూడు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఒకటిగా ఉందని జవహర్ రెడ్డి చెప్పారు. చాలా రాష్ట్రాలు ఏపీ అనుసరిస్తున్న విధానాలను అమలు చేస్తున్నాయని వివరించారు. రాష్ట్రంలోని 1,175 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇద్దరు వైద్యులుండేలా చర్యలు చేపట్టామని… ప్రతి ఏరియా ఆస్పత్రిలో ముగ్గురు గైనకాలజిస్ట్‌లు ఉండేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.

First Published:  21 Jun 2020 11:14 PM GMT
Next Story