ఇప్పట్లో షూటింగ్స్ కు వెళ్లను

షూటింగ్స్ కు పర్మిషన్ వచ్చేసింది. కొంతమంది ఇంకా తమ సినిమాలు స్టార్ట్ చేయలేదు. మరికొంతమంది సెట్స్ పైకి వస్తున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ నిత్యామీనన్ కూడా స్పందించింది. ఇప్పట్లో తనకు షూటింగ్స్ కు వెళ్లే మూడ్ లేదని తేల్చి చెప్పేసింది ఈ బ్యూటీ. ఈ మేరకు తన నిర్మాతలకు సమాచారం అందించానంటోంది.

సెట్స్ లో భౌతికదూరం పాటించడం దాదాపు అసాధ్యం అంటోంది నిత్యామీనన్. మరికొన్ని రోజులాగి కరోనా పరిస్థితుల్ని సమీక్షించిన తర్వాతే షూటింగ్స్ కు వెళ్తానని స్పష్టంచేసింది. ప్రస్తుతానికైతే షూటింగ్స్ కోసం తహతహలాడడం లేదని తెలిపింది.

ఈ లాక్ డౌన్ టైమ్ లో బెంగళూరులో తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటోంది నిత్యామీనన్. ఈ గ్యాప్ లో తనకు బోర్ కొట్టలేదని, నిజం చెప్పాలంటే లాక్ డౌన్ టైమ్ ను బాగా సద్వినియోగం చేసుకున్నానని చెబుతోంది. నిజమే.. ఈ 2 నెలల కాలంలో ఏకంగా ఓ సినిమా స్క్రిప్ట్ సిద్ధం చేసింది ఈ నేచురల్ బ్యూటీ.