ట్రయల్ షూట్ కు అంతా రెడీ

లెక్కప్రకారం ఈపాటికి ఆర్ఆర్ఆర్ యల్ షూట్ పూర్తవ్వాలి. కానీ రకరకాల కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. ఎట్టకేలకు ఆర్ఆర్ఆర్ కు సంబంధించి టెస్ట్ షూట్ కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాడు రాజమౌళి. 25వ తేదీన హైదరాబాద్ శివార్లలోని గండిపేట్ లో ట్రయల్ షూట్ స్టార్ట్ అవుతుంది.

చరణ్, తారక్ ఈ టెస్ట్ షూట్ కు హాజరుకాకపోవచ్చు కానీ ఇతర నటీనటులతో షూట్ నిర్వహించబోతున్నారు. 2 రోజుల పాటు ట్రయర్ షూట్ చేసిన తర్వాత ఫుల్ లెంగ్త్ షూట్ పై నిర్ణయం తీసుకుంటారు.

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం.. సిబ్బందిని బాగా తగ్గించాడు జక్కన్న. ఏ ఏ డిపార్ట్ మెంట్స్ నుంచి ఎవరెవరు సెట్స్ లో ఉండాలనే అంశంపై ఇప్పటికే ప్లానింగ్ రెడీ అయింది. మరోవైపు థర్మామీటర్లు, పీపీఈ కిట్లు, శానిటైజర్లు కూడా రెడీ చేశారు.

తక్కువ మంది సిబ్బందితో ఆర్ఆర్ఆర్ షూటింగ్ సాధ్యమౌతుందా అవ్వదా అని తెలుసుకునేందుకే ఈ ట్రయల్ షూట్. 2 రోజుల టెస్ట్ షూట్ లో మంచి రిజల్ట్స్ వస్తే.. రెగ్యులర్ షూటింగ్ కొనసాగిస్తారు. లేదంటే షూటింగ్ ను ఇంకొన్నాళ్లు వాయిదా చేస్తారు.