Telugu Global
National

3,297 పరీక్షలు... 730 పాజిటివ్ కేసులు... తెలంగాణలో వైరస్‌ వ్యాప్తి

తెలంగాణలో కరోనా వ్యాధి తీవ్రత అంతకంతకు పెరుగుతోంది. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా విజృంభిస్తోంది. తక్కువ పరీక్షలకే భారీగా పాజిటివ్ కేసులు నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఏపీలో 24 గంటల్లో 24వేల 451 పరీక్షలు నిర్వహించగా… 439 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. తెలంగాణలో ఆదివారం 3వేల 297 పరీక్షలు నిర్వహించారు. ఏకంగా 730 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈస్థాయిలో ఒకేరోజు కరోనా కేసులు నమోదు అవడడం ఇదే తొలిసారి. భారీగా పరీక్షలు నిర్వహిస్తే […]

3,297 పరీక్షలు... 730 పాజిటివ్ కేసులు... తెలంగాణలో వైరస్‌ వ్యాప్తి
X

తెలంగాణలో కరోనా వ్యాధి తీవ్రత అంతకంతకు పెరుగుతోంది. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా విజృంభిస్తోంది. తక్కువ పరీక్షలకే భారీగా పాజిటివ్ కేసులు నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

ఏపీలో 24 గంటల్లో 24వేల 451 పరీక్షలు నిర్వహించగా… 439 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. తెలంగాణలో ఆదివారం 3వేల 297 పరీక్షలు నిర్వహించారు. ఏకంగా 730 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈస్థాయిలో ఒకేరోజు కరోనా కేసులు నమోదు అవడడం ఇదే తొలిసారి. భారీగా పరీక్షలు నిర్వహిస్తే మరిన్ని కేసులు బయటపడే అవకాశం ఉంది.

ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం కేవలం 57వేల 54 కరోనా పరీక్షలు మాత్రమే నిర్వహించగలిగింది. మొత్తం కేసుల సంఖ్య 7వేల 802కు చేరింది. ఇప్పటి వరకు 210 మంది చనిపోయారు.

ఆదివారం నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 659 కేసులున్నాయి. జనగామ లో 34, రంగారెడ్డి జిల్లాలో 10, మేడ్చల్‌ జిల్లాలో 9, వరంగల్‌లో 6, ఆసిఫాబాద్‌ లో 3, వికారాబాద్‌లో 2, సంగారెడ్డి, ఆదిలాబాద్, యాదాద్రి భువనగిరి, కొత్తగూడెం, నారాయణపేట, మెదక్, నల్లగొండ జిల్లాల్లో ఒక్కో పాజిటివ్‌ కేసు నమోదైంది.

First Published:  21 Jun 2020 11:03 PM GMT
Next Story