Telugu Global
International

హెచ్1బీ వీసాలపై నిషేధం

అమెరికా వలస విధానాన్ని మార్పు చేయడంలో భాగంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై అమెరికాలో నిపుణులు మాత్రమే అడుగుపెట్టేలా హెచ్1బీ వీసాల జారీ విధానంలో మార్పు చేశారు. దీనిలో భాగంగా ఈ ఏడాది చివరి వరకు హెచ్1బీ వీసాల జారీపై నిషేధం విధించారు. అంతే కాకుండా సదరు వీసాల జారీ ఇకపై లాటరీ పద్దతిలో ఉండదని.. కేవలం ప్రతిభ ఆధారంగానే వీసాల జారీ ఉంటుందని వైట్ హౌస్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. […]

హెచ్1బీ వీసాలపై నిషేధం
X

అమెరికా వలస విధానాన్ని మార్పు చేయడంలో భాగంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై అమెరికాలో నిపుణులు మాత్రమే అడుగుపెట్టేలా హెచ్1బీ వీసాల జారీ విధానంలో మార్పు చేశారు. దీనిలో భాగంగా ఈ ఏడాది చివరి వరకు హెచ్1బీ వీసాల జారీపై నిషేధం విధించారు. అంతే కాకుండా సదరు వీసాల జారీ ఇకపై లాటరీ పద్దతిలో ఉండదని.. కేవలం ప్రతిభ ఆధారంగానే వీసాల జారీ ఉంటుందని వైట్ హౌస్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రస్తుతం హెచ్1బీ వీసాలను లాటరీ పద్దతిలో ఎంపిక చేస్తారు. హెచ్1బీకి దరఖాస్తు చేసుకునే ఉద్యోగుల పేర్లను లాటరీ ద్వారా ఎంపిక చేసిన తర్వాత వారిని స్పాన్సర్ చేసే కంపెనీలు అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. కానీ ఇకపై లాటరీ పద్దతిలో కాకుండా… వచ్చిన దరఖాస్తుల్లో అత్యధిక వేతనం పొందే ఉద్యోగులను ఎంపిక చేసి వీసా జారీ చేస్తారు. ప్రతీ ఏడాది అమెరికా ప్రభుత్వం 85 వేల హెచ్1బీ వీసాలు జారీ చేస్తోంది. అంటే వచ్చిన దరఖాస్తుల్లో అత్యధిక వేతనం ఉన్న 85 వేల మందిని ఎంపిక చేసి వీసాలు ఇస్తారు.

ఇక వీసా జారీ నిబంధనల మార్పు వల్ల అత్యధికంగా భారత్, చైనా ఉద్యోగులపై ప్రభావం చూపనుంది. ఈ రెండు దేశాల వారికే ఈ వీసాలు ఎక్కువగా జారీ అవుతాయి. కారణం ఇక్కడ ఉద్యోగులు తక్కువ వేతనానికైనా పని చేయడానికి సిద్దంగా ఉంటారు. ఇకపై ఇలా స్థానిక అమెరికన్ల ఉద్యోగాలను విదేశీయులు తన్నుకొనిపోకుండా కొత్త విధానాన్ని తీసుకొని వచ్చారు. అధిక వేతనం ఉన్న ప్రతిభావంతులను మాత్రమే దేశంలో పని చేయడానికి అనుమతి ఇవ్వడంతో స్థానిక అమెరికన్లకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

కాగా, ఇప్పటికే చెల్లుబాటులో ఉన్న వీసా కలిగి ఉంటే వారికి ఎలాంటి సమస్యలు ఉండవు. స్టుడెంట్ వీసాపై ఉన్న వాళ్లు వర్క్ పర్మిట్ తీసుకోవడానికి కూడా ఇబ్బంది లేదు. కానీ హెచ్1బీ వీసా కలిగియున్న వ్యక్తి డిపెండెంట్లు వీసాలు పొందడానికి మాత్రం ఈ ఏడాది చివరి వరకు వేచి చూడాల్సి ఉంటుంది.

First Published:  23 Jun 2020 4:38 AM GMT
Next Story