Telugu Global
National

చైనా వస్తువుల బహిష్కరణ సాధ్యం కాదు " ఎల్ అండ్ టీ ఎండీ

చైనాతో సరిహద్దు వివాదం ముదురుతున్న వేళ దేశ వ్యాప్తంగా ఆ దేశ వస్తువులు, ఉత్పత్తులను నిషేధించాలని అందరూ కోరుతున్నారు. కాగా, చైనా వస్తువుల బహిష్కరణ ప్రస్తుతం సాధ్యం అయ్యే విషయం కాదని ప్రముఖ మౌళిక సదుపాయాల సంస్థ ఎల్ అండ్ టీ ఎండీ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ స్పష్టం చేశారు. ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు వెల్లడించారు. మన దేశంలో చైనా సంస్థలు పాతుకొని పోయాయి. వాళ్లు ఇక్కడ దుకాణాలు తెరిచి వస్తువులను […]

చైనా వస్తువుల బహిష్కరణ సాధ్యం కాదు  ఎల్ అండ్ టీ ఎండీ
X

చైనాతో సరిహద్దు వివాదం ముదురుతున్న వేళ దేశ వ్యాప్తంగా ఆ దేశ వస్తువులు, ఉత్పత్తులను నిషేధించాలని అందరూ కోరుతున్నారు. కాగా, చైనా వస్తువుల బహిష్కరణ ప్రస్తుతం సాధ్యం అయ్యే విషయం కాదని ప్రముఖ మౌళిక సదుపాయాల సంస్థ ఎల్ అండ్ టీ ఎండీ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ స్పష్టం చేశారు. ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు వెల్లడించారు.

మన దేశంలో చైనా సంస్థలు పాతుకొని పోయాయి. వాళ్లు ఇక్కడ దుకాణాలు తెరిచి వస్తువులను అమ్ముతున్నారు. అవి చాలా చౌకగా అందుబాటు ధరల్లో దొరుకుతున్నాయి. అలాంటి సమయంలో మనం చైనా వస్తువులు బహిష్కరణ చేయలేము. అలా చేయాలంటే మనం దీర్ఘకాలంలో ఒక ప్రణాళిక సిద్దం చేయాలి. ఇండియాలోనే వస్తు తయారీని ప్రోత్సహించాలి. నాణ్యమైన వస్తువులు చౌకధరలకు తయారు చేస్తే రాబోయే 4 నుంచి 5 ఏండ్లలో చైనా వస్తువులను బహిష్కరించే దిశగా అడుగులు వేయొచ్చని అన్నారు.

ఇక ఈ సమయంలో దిగుమతి సుంకాలను పెంచడం వల్ల అనేక భారతీయ కంపెనీలకు భారంగా మారుతుంది. ఇప్పటికే మాలాంటి చాలా కంపెనీలు చైనా నుంచి భారీ మెషినరీలు ఆర్డర్లు పెట్టాయి. దిగుమతి సుంకం పెంచడం పెనుభారమవుతుంది. కాబట్టి ప్రస్తుతానికి అలాంటి ఆలోచన విరమించుకోవడం మంచిది.

ఇక కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో అనేక మంది కార్మికులు, కూలీలు స్వగ్రామాలకు వెళ్లిపోయారు. ప్రస్తుతం 90 శాతం ప్రాజెక్టుల్లో పనులు జరుగుతున్నాయి. కానీ 40 శాతం మంది కూలీలు మాత్రమే అందుబాటులో ఉన్నారు. మాకు కనీసం 2,30,000 నుంచి 2,40,000 మంది అవసరం ఉన్నారు. వీరందరినీ మరో 60 రోజుల్లోపు తిరిగి స్వస్థలాల నుంచి తీసుకొని రావాలని అనుకుంటున్నాం. అయితే కరోనా తీవ్రంగా ఉన్న ముంబై, ఢిల్లీ, చెన్నై వంటి నగరాలకు వీళ్లు వస్తారా లేదా అనేది సందిగ్దంలో ఉందని ఆయన అన్నారు.

First Published:  23 Jun 2020 2:26 AM GMT
Next Story