Telugu Global
National

గ్రేటర్‌లో కరోనా దడ.... మరో ముంబైగా మారుతుందా?

తెలంగాణలో రెండు రోజుల్లో వెయ్యి కరోనా కేసులు నమోదు అయ్యాయి. జూన్‌ 20న 7000 కేసులు ఉంటే… రెండు రోజుల్లో 8వేలు దాటేశాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇలాగే కరోనా వ్యాప్తి ఉంటే ముంబై, చెన్నై, ఢిల్లీలాగా పరిస్థితి మారే అవకాశముందని హెచ్చరికలు వినిపిస్తున్నాయి. తెలంగాణ కరోనా కేసులు ఒక్కసారి పరిశీలిస్తే…. మార్చి 2 – మొదటి కేసు ఏప్రిల్‌ 26 – 1000 మే27- 2000 జూన్‌ 3- […]

గ్రేటర్‌లో కరోనా దడ.... మరో ముంబైగా మారుతుందా?
X

తెలంగాణలో రెండు రోజుల్లో వెయ్యి కరోనా కేసులు నమోదు అయ్యాయి. జూన్‌ 20న 7000 కేసులు ఉంటే… రెండు రోజుల్లో 8వేలు దాటేశాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.

ఇలాగే కరోనా వ్యాప్తి ఉంటే ముంబై, చెన్నై, ఢిల్లీలాగా పరిస్థితి మారే అవకాశముందని హెచ్చరికలు వినిపిస్తున్నాయి.

తెలంగాణ కరోనా కేసులు ఒక్కసారి పరిశీలిస్తే….

మార్చి 2 – మొదటి కేసు
ఏప్రిల్‌ 26 – 1000
మే27- 2000
జూన్‌ 3- 3000
జూన్‌ 10- 4000
జూన్‌ 15- 5000
జూన్‌ 18- 6000
జూన్‌ 20- 7000
జూన్‌ 22- 8000

తెలంగాణలో సోమవారం 872 కరోనా కేసులు నమోదు అయ్యాయి. వీటిలో ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే 713 కేసులు బయటపడ్డాయి. ఇక పక్కనే ఉన్న రంగారెడ్డిలో 107 కేసులు పాజిటివ్‌ గా తేలాయి. ఇవి కూడా కలుపుకుంటే 820 కేసులు ఒక్క హైదరాబాద్‌లోనే బయటపడడం ఆందోళన కలిగిస్తోంది. సోమవారం ఒక్కరోజే ఏడుగురు మృతిచెందారు.

అయితే ప్రభుత్వం మాత్రం పరీక్షల సంఖ్య పెంచడం వల్ల కేసులు పెరుగుతున్నాయనే థియరీ చెబుతోంది. సోమవారం 3,189 పరీక్షలు చేస్తే 872 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. అంటే ఇంకా పరీక్షలు పెంచితే మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉంది.

ముంబై, చెన్నైలో లాగానే గ్రేటర్‌ హైదరాబాద్‌లో కూడా జనం భౌతిక దూరం మరిచిపోయారు. అన్‌లాక్‌ తర్వాత ఇక్కడ పరిస్థితి మొత్తం మారిపోయింది. లాక్‌డౌన్‌లో మొత్తం మూడు వేల దాకా కేసులు ఉంటే… ఈ ఒక్క 20 రోజుల్లోనే ఐదువేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి.

రాబోయే వారం రోజుల్లో కూడా పరిస్థితి ఇలాగే ఉంటే….ప్రభుత్వం కఠిన చర్యల దిశగా అడుగులు వేసే అవకాశం కన్పిస్తోంది. చెన్నైలో లాగా లాక్‌డౌన్‌ విధించే పరిస్థితులు కూడా ఉన్నాయని సమాచారం.

First Published:  22 Jun 2020 8:24 PM GMT
Next Story