ఏపీలో కమ్యూనిటీ స్ప్రెడ్‌ 8 శాతం…. ఢిల్లీ, తెలంగాణలో 100 శాతం పైనే…

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి శాతంపై ఇండియా డాట్‌ ఇన్‌ పిక్సెల్స్‌ సంస్థ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం ఏపీలో కమ్యూనిటీ స్ప్రెడ్‌ కు అవకాశం 8 శాతంగా ఉంది. కర్నాటకలోనూ 8 శాతంగా ఉంది.

అయితే దేశంలో ఢిల్లీ, ఆ తర్వాత తెలంగాణలో మాత్రం భారీగా కమ్యూనిటీ స్ప్రెడ్‌ ఉన్నట్టు నివేదిక చెబుతోంది. ఢిల్లీలో ఈ శాతం 143 గా ఉంది. తెలంగాణలో కమ్యూనిటీ స్ప్రెడ్‌ 122 శాతంగా ఉంది. ఆ తర్వాత మహారాష్ట్ర 65శాతం, తమిళనాడు 38 శాతంగా ఉంది.

గుజరాత్‌ 45 శాతం, మహారాష్ట్ర 65 శాతం, రాజస్తాన్, పశ్చిమబెంగాల్‌ 24 శాతం, తమిళనాడు 38 శాతాలతో కమ్యూనిటీ స్ప్రెడ్‌కు అవకాశాలు అధికంగా ఉన్నాయి.

సామూహిక వ్యాప్తి జరిగే అవకాశాలు చాలా తక్కువ ఉన్న పెద్ద రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఉంది. ఎక్కువ పరీక్షలు చేస్తూ ఎప్పటికప్పుడు కట్టడి చర్యలు తీసుకోవడం వల్లే ఇది సాధ్యమైందని చెబుతున్నారు. 7,000 కేసులు దాటిన రాష్ట్రాల్లో కమ్యూనిటీ స్ప్రెడ్‌ అత్యల్పంగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశే.