Telugu Global
NEWS

ప్రతి ఇంటినీ జల్లెడ పట్టండి...

కరోనా వ్యాప్తిని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే సమర్థవంతంగా ఎదుర్కొంటున్న ఏపీ ప్రభుత్వం మరో భారీ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలోని ప్రతి ఇంటిని జల్లెడ పట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కరోనాపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి… 90 రోజుల్లోగా ప్రతి కుటుంబాన్ని స్క్రీనింగ్ చేయాల్సిందిగా ఆదేశించారు. మండలానికి ఒక 104 వాహనాన్ని కేటాయించి గ్రామాల్లో తిరుగుతూ అనుమానం ఉన్న ప్రతి ఒక్కరి నుంచి శాంపిల్స్ సేకరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. […]

ప్రతి ఇంటినీ జల్లెడ పట్టండి...
X

కరోనా వ్యాప్తిని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే సమర్థవంతంగా ఎదుర్కొంటున్న ఏపీ ప్రభుత్వం మరో భారీ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలోని ప్రతి ఇంటిని జల్లెడ పట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కరోనాపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి… 90 రోజుల్లోగా ప్రతి కుటుంబాన్ని స్క్రీనింగ్ చేయాల్సిందిగా ఆదేశించారు.

మండలానికి ఒక 104 వాహనాన్ని కేటాయించి గ్రామాల్లో తిరుగుతూ అనుమానం ఉన్న ప్రతి ఒక్కరి నుంచి శాంపిల్స్ సేకరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 104 వాహనంలోనే శాంపిల్స్ సేకరించే ఏర్పాట్లు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.

వృద్ధులు, బీపీ, షుగర్ వంటి వ్యాధులతో బాధపడుతున్న వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ప్రతి నెల 104 వాహనం ప్రతి గ్రామానికి వెళ్లి పరీక్షలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రతి ఇంటికి వెళ్లి కరోనా లక్షణాలు ఉన్నాయో లేవో పరిశీలించాలని… 90 రోజుల్లోగా ఈ స్క్రీనింగ్‌ పూర్తి కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. లక్షణాలు ఉన్న వారి శాంపిల్స్‌ను ఇంటి వద్దే సేకరించి వాటిని పరీక్షలకు పంపే ఏర్పాట్లు చేయాలన్నారు.

కరోనా నివారణకు తీసుకుంటున్నచర్యలను ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు 24వేల పరీక్షలు చేస్తున్నామని… రాబోయే రోజుల్లో పరీక్షల సంఖ్యను మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీఎంకు అధికారులు వివరించారు.

మరణాలను నిరోధించేందుకు గాను… 60ఏళ్లు పైబడిన వారికి, 40 ఏళ్లు పైబడి ఇతర జబ్బులతో బాధపడుతున్నా వారిపై ఎక్కువగా దృష్టి పెట్టాలని అధికారులు చెప్పారు. అత్యధిక పరీక్షలు కూడా ఈ వయసు వారికే చేస్తున్నామని… ఆ తర్వాత కంటైన్‌మెంట్ జోన్లు, హై రిస్క్‌లో ఉన్న వారికి పరీక్షలు నిర్వహించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు వివరించారు.

అధికారుల వివరణ తర్వాత సీఎం మరిన్ని సూచనలు చేశారు. 50 శాతం పరీక్షలు కంటైన్మెంట్ జోన్లలో చేయడంతో పాటు మిగిలిన 50 శాతం పరీక్షలు తమకు తాముగా ముందుకొచ్చిన వారికి, కాల్‌సెంటర్‌ ద్వారా సమాచారం అందించిన వారికి నిర్వహించాలని సీఎం ఆదేశించారు. వైరస్‌ బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో పరీక్షలు నిర్వహించాలన్నారు.

కరోనా ఉన్నట్టు అనుమానం వస్తే ఏం చేయాలన్న దానిపై ప్రతి గ్రామంలో హోర్డింగ్ ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు. ఎవరిని సంప్రదించాలన్న దానికి ఫోన్ నెంబర్లు కూడా ప్రచారం చేయాలని సీఎం సూచించారు.

90 రోజుల్లోగా రాష్ట్రంలోని ప్రతి కుటుంబాన్ని జల్లెడ పట్టాలని… కరోనా లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు నిర్వహించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి ప్రాథమిక వైద్య కేంద్రంలోనూ కొవిడ్ శాంపిల్ కలెక్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.

First Published:  22 Jun 2020 8:46 PM GMT
Next Story