Telugu Global
NEWS

ఎమ్మెల్యేలకు సీఎం అపాయింట్‌మెంట్

ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి భేటీ అవుతున్నారు. ప్రతి రోజు సాయంత్రం ఎమ్మెల్యేల కోసం ప్రత్యేకంగా సమయం కేటాయిస్తున్నారు. ఎమ్మెల్యేలు తమ సాధక బాధకాలు చెప్పుకునే అవకాశం జగన్‌మోహన్ రెడ్డి ఇవ్వలేకపోతున్నారన్న అసంతృప్తి నేపథ్యంలో జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో సమావేశం అయ్యారు. ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రరావు, సాయిప్రసాద్ రెడ్డి, బాలనాగిరెడ్డి, కళావతి, ధనలక్ష్మి, జొన్నలగడ్డ పద్మావతి, మంత్రి పుష్ప శ్రీవాణి, ఎంపీ అనురాధాలు ముఖ్యమంత్రిని కలిశారు. వారి వారి […]

ఎమ్మెల్యేలకు సీఎం అపాయింట్‌మెంట్
X

ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి భేటీ అవుతున్నారు. ప్రతి రోజు సాయంత్రం ఎమ్మెల్యేల కోసం ప్రత్యేకంగా సమయం కేటాయిస్తున్నారు. ఎమ్మెల్యేలు తమ సాధక బాధకాలు చెప్పుకునే అవకాశం జగన్‌మోహన్ రెడ్డి ఇవ్వలేకపోతున్నారన్న అసంతృప్తి నేపథ్యంలో జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు.

మంగళవారం పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో సమావేశం అయ్యారు. ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రరావు, సాయిప్రసాద్ రెడ్డి, బాలనాగిరెడ్డి, కళావతి, ధనలక్ష్మి, జొన్నలగడ్డ పద్మావతి, మంత్రి పుష్ప శ్రీవాణి, ఎంపీ అనురాధాలు ముఖ్యమంత్రిని కలిశారు. వారి వారి నియోజకవర్గాల్లోని సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి విజ్ఞప్తి మేరకు ఆదోనిలో మెడికల్ కాలేజీ‌ ఏర్పాటు, ఆదోని పట్టణంలో రోడ్ల విస్తరణకు ముఖ్యమంత్రి అంగీకరించినట్టు చెబుతున్నారు.

రాజోలిబండ కుడికాలువ నిర్మాణానికి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి విజ్ఞప్తి చేయగా సీఎం సానుకూలంగా స్పందించారు.

గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయలు మెరుగుపరిచేందుకు ఎమ్మెల్యేలు ఇచ్చిన విజ్ఞప్తులకు సీఎం సానుకూలంగా స్పందించారని సమాచారం.

నేడు మరికొందరు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ ఇచ్చారు. ప్రభుత్వంపై మీడియాకు ఎక్కిన వారికి ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్‌ ఇస్తారా లేదా అన్న దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.

First Published:  23 Jun 2020 11:38 PM GMT
Next Story