పూరి నెక్ట్స్ సినిమా అదేనా?

ఈ లాక్ డౌన్ టైమ్ లో మరో సినిమా స్క్రిప్ట్ ను పూరి జగన్నాధ్ పూర్తిచేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ విషయాన్ని అతడే స్వయంగా బయటపెట్టాడు కూడా. దీంతో బాలయ్యతో పూరి జగన్నాధ్ మరో సినిమాకు రెడీ అవుతున్నాడంటూ కథనాలు వచ్చాయి. అయితే ఇప్పుడు దీనికి పోటీగా మరో ప్రాజెక్టు కూడా తెరపైకి వచ్చింది. అదే జనగణమన.

ఈ టైటిల్ ఎక్కడో విన్నట్టు అనిపిస్తోందా.. నిజమే, గతంలో పూరి జగన్నాధ్ స్వయంగా ప్రకటించిన టైటిల్ ఇది. మహేష్ బాబు ఫొటోతో ఈ సినిమాను అతడు అఫీషియల్ గా ప్రకటించాడు కూడా. అయితే మహేష్ బాబు నో చెప్పడంతో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. ఇప్పుడా సినిమాపై పూరి ప్రత్యేకంగా స్పందించాడు. జనగణమన సినిమాను పాన్-ఇండియా లెవెల్లో తీస్తానని, దానికి సంబంధించి సెటప్ మొత్తం సిద్ధంగా ఉందని ప్రకటించాడు ఈ డైరక్టర్.

దీంతో ప్రస్తుతం విజయ్ దేవరకొండతో చేస్తున్న ఫైటర్ సినిమా తర్వాత పూరి జగన్నాధ్ ఈ జనగణమన కాన్సెప్ట్ నే తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉందంటూ పుకార్లు వస్తున్నాయి. వీటిపై క్లారిటీ రావాలంటే పూరి జగన్నాధ్ ఇచ్చే నెక్ట్స్ సినిమా ఎనౌన్స్ మెంట్ వరకు ఆగాల్సిందే.

మరోవైపు మహేష్ అభిమానులు మాత్రం తమ హీరోతోనే ఈ సినిమా చేయాలని కోరుతున్నారు. పూరి మాత్రం మరో హీరో కోసం వెదికే పనిలో బిజీగా ఉన్నాడు.