Telugu Global
National

రఘురామకృష్ణంరాజుకు షోకాజ్ నోటీసులు జారీ

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై చర్యలకు వైసీపీ సిద్ధమవుతోంది. కొద్దికాలంగా పార్టీ, ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపడుతూ మాట్లాడుతున్న రఘురామకృష్ణంరాజుకు వైసీపీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారంలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. పార్టీ, ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడడంపై నోటీసులు ఇచ్చారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై చేసిన నిరాధార ఆరోపణలకు వివరణ ఇవ్వాలని వైసీపీ నాయకత్వం ఆదేశించింది. పార్టీ లైన్ ధిక్కరించారంటూ కొన్ని ఉదంతాలను కూడా ప్రస్తావించారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం అందిస్తామన్నది పార్టీ మేనిఫెస్టోలోనే ఉందని… […]

రఘురామకృష్ణంరాజుకు షోకాజ్ నోటీసులు జారీ
X

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై చర్యలకు వైసీపీ సిద్ధమవుతోంది. కొద్దికాలంగా పార్టీ, ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపడుతూ మాట్లాడుతున్న రఘురామకృష్ణంరాజుకు వైసీపీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారంలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. పార్టీ, ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడడంపై నోటీసులు ఇచ్చారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై చేసిన నిరాధార ఆరోపణలకు వివరణ ఇవ్వాలని వైసీపీ నాయకత్వం ఆదేశించింది.

పార్టీ లైన్ ధిక్కరించారంటూ కొన్ని ఉదంతాలను కూడా ప్రస్తావించారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం అందిస్తామన్నది పార్టీ మేనిఫెస్టోలోనే ఉందని… ఆ విషయంలో పార్టీ లైన్‌కు విరుద్ధంగా రఘురామకృష్ణంరాజు మాట్లాడిన అంశాన్ని కూడా నోటీసుల్లో పొందుపరిచారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే వైసీపీ ఎమ్మెల్యేలు ఇసుక దోచేస్తున్నారన్న ఆరోపణలపైనా వివరణ కోరారు.

ఎవరి నాయకత్వం నాకు కావాలి ……లో నాయకత్వం అంటూ చేసిన వ్యాఖ్యలను నోటీసుల్లో ప్రస్తావించారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకించడంపైనా షోకాజ్ నోటీసుల్లో సమాధానం కోరారు. తనకుతాను సింహంతో పోల్చుకుంటూ… పార్టీ ఎమ్మెల్యేలను పందులతో పోల్చడాన్ని కూడా నోటీసుల్లో ప్రస్తావించి వివరణ కోరారు.

కావాలనే రఘురామకృష్ణంరాజు వైసీపీని ధిక్కరిస్తున్నారన్న ప్రచారం ఉంది. పార్టీ సస్పెండ్ చేస్తే బీజేపీలో చేరేందుకు నిర్ణయించుకునే ఇలా ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డపేరు వచ్చేలా రఘురామకృష్ణంరాజు వ్యవహరిస్తున్నారని వైసీపీ నేతలు బహిరంగంగానే ఆరోపించారు.

ఆ మధ్య మంత్రులు పేర్నినాని, శ్రీరంగనాథరాజు, నరసాపురం పార్లమెంట్‌ పరిధిలోని ఎమ్మెల్యేలు మీడియా ముందుకు వచ్చి రఘురామకృష్ణంరాజుపై ఎదురుదాడి చేశారు. ఆ తర్వాత రఘురామకృష్ణంరాజు తిరిగి వైసీపీ ఎమ్మెల్యేలపై విమర్శలు చేశారు. తనకు రక్షణ లేదంటూ ఇటీవల రఘురామకృష్ణంరాజు లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారు. కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరారు. సొంత పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో తనకు భద్రత లేదని స్పీకర్‌కు లేఖ రాయడాన్ని వైసీపీ సీరియస్‌గా తీసుకుంది.

First Published:  24 Jun 2020 4:16 AM GMT
Next Story