Telugu Global
NEWS

అసభ్యకర పోస్టులు పెడితే పార్టీలకతీతంగా చర్యలు " విజయసాయిరెడ్డి

పార్టీ క్రమశిక్షణ ఎవరు ఉల్లంఘించినా, ఎంతటి పెద్దవారైనా చర్యలు తప్పవన్నది అందరూ గమనించుకోవాలన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. రఘురామకృష్ణంరాజు ఇచ్చిన ప్రకటనల ఆధారంగా ఆయనకు షోకాజ్ నోటీసు ఇచ్చామన్నారు. సమాధానం ఇచ్చిన తర్వాత తదుపరి చర్యలు ఎలా ఉంటాయన్నది నిర్ణయిస్తామన్నారు. రఘురామకృష్ణంరాజుకు మిగిలిన ఎంపీల కంటే ఎక్కువ గౌరవమే లభించిందన్నారు. పార్లమెంట్‌లో చాలా పదవులు వైసీపీ ఎంపీ అవడం వల్లే వచ్చాయన్నారు. లోక్‌సభలో ఉన్న సంఖ్యాబలం ఆధారంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన లేఖ వల్లనే ఆయనకు […]

అసభ్యకర పోస్టులు పెడితే పార్టీలకతీతంగా చర్యలు  విజయసాయిరెడ్డి
X

పార్టీ క్రమశిక్షణ ఎవరు ఉల్లంఘించినా, ఎంతటి పెద్దవారైనా చర్యలు తప్పవన్నది అందరూ గమనించుకోవాలన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. రఘురామకృష్ణంరాజు ఇచ్చిన ప్రకటనల ఆధారంగా ఆయనకు షోకాజ్ నోటీసు ఇచ్చామన్నారు. సమాధానం ఇచ్చిన తర్వాత తదుపరి చర్యలు ఎలా ఉంటాయన్నది నిర్ణయిస్తామన్నారు.

రఘురామకృష్ణంరాజుకు మిగిలిన ఎంపీల కంటే ఎక్కువ గౌరవమే లభించిందన్నారు. పార్లమెంట్‌లో చాలా పదవులు వైసీపీ ఎంపీ అవడం వల్లే వచ్చాయన్నారు. లోక్‌సభలో ఉన్న సంఖ్యాబలం ఆధారంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన లేఖ వల్లనే ఆయనకు చైర్మన్ పదవి కూడా వచ్చిందన్నారు. నిర్ణీత గడుపులో షోకాజ్‌ నోటీసులకు రఘురామకృష్ణంరాజు సమాధానం ఇస్తారని తాము భావిస్తున్నామన్నారు.

సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు ఎవరు పెట్టినా పార్టీలకు అతీతంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. మహిళల పట్ల పెడుతున్న అనుచిత పోస్టులపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. మహిళలపై పోస్టులు పెట్టేముందు తన కుటుంబంలోనూ ఆడవారు ఉన్నారన్న విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకుని పోస్టులు పెట్టాలన్నారు. విమర్శలు చేస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదని… అలా కాకుండా అనుచిత పోస్టులు పెడితే మాత్రం చర్యలు తప్పవన్నారు. ఇలాంటి అనుచిత పోస్టుల వ్యవహారంలో ఇంకా చాలా మంది ఉన్నారని వారందరిపైనా చర్యలు తప్పకుండా ఉంటాయన్నారు.

నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ ఒక రాజ్యాంగబద్దమైన పదవిలో ఉండేందుకు అనర్హుడన్నారు. ఈసీని తోలుబొమ్మలా పెట్టుకుని ఇబ్బందులు సృష్టించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంలో సుజనాచౌదరి, కామినేని శ్రీనివాస్‌లు సహకరిస్తున్నారన్నారు.

కేంద్ర హోంశాఖకు నిమ్మగడ్డ రాసిన లేఖ ఆయన రాయలేదని… టీడీపీ ఎంపీ ఒకరు రాసి… సంతకం కూడా వారే చేసినా… అది తానే రాశానంటూ నిమ్మగడ్డ చెప్పుకుంటున్నారని విమర్శించారు.

First Published:  24 Jun 2020 8:05 AM GMT
Next Story