Telugu Global
National

ప్రచారానికి దూరంగా... పనులు వేగంగా... పోలవరంలో మేఘా

కార్యచరణ రూపొందించిన సీఎం జగన్ రోజుకు 3వేల క్యూబిక్ మీటర్ల పనులు 2021 డిసెంబర్ నాటికి పూర్తి స్థాయిలో రెడీ గోదావరి నదిపై పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అనేది ఎన్నో దశాబ్దాలుగా ఒక కల. కానీ ఆ కలను 2004లో నిజం చేయడానికి పూనుకుంది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి. కాగా, రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా లభించింది. 100 శాతం నిధులను కేంద్రమే ఇచ్చేట్లుగా విభజన చట్టంలో హామీ ఇచ్చారు. అప్పుడు […]

ప్రచారానికి దూరంగా... పనులు వేగంగా... పోలవరంలో మేఘా
X
  • కార్యచరణ రూపొందించిన సీఎం జగన్
  • రోజుకు 3వేల క్యూబిక్ మీటర్ల పనులు
  • 2021 డిసెంబర్ నాటికి పూర్తి స్థాయిలో రెడీ

గోదావరి నదిపై పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అనేది ఎన్నో దశాబ్దాలుగా ఒక కల. కానీ ఆ కలను 2004లో నిజం చేయడానికి పూనుకుంది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి. కాగా, రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా లభించింది. 100 శాతం నిధులను కేంద్రమే ఇచ్చేట్లుగా విభజన చట్టంలో హామీ ఇచ్చారు. అప్పుడు అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం ఈ అవకాశాన్ని ప్రాజెక్టు కట్టడానికి సద్వినియోగం చేసుకోవాల్సింది పోయి.. తమకు ఒక డబ్బులు కురిపించే కామధేనువులా వాడుకున్నారు.

సోమవారం కాదు ఇక నుంచి పోలవారం అని పిలవాలంటూ చంద్రబాబు పిలుపునిచ్చారు. పోలవరాన్ని ఒక ప్రచార ఆర్భాటంలా మార్చారు కానీ అక్కడ అసలు పనులు జరుగుతున్నాయా..? కాంట్రాక్టర్లు పనులు సమయానికి పూర్తి చేస్తున్నారా? అని కనీసం పర్యవేక్షణ చేయలేకపోయారు.

వైఎస్ జగన్ ఏపీ సీఎం అయిన తర్వాత, గత 13 నెలలుగా పోలవరం పనులు అసలు జరుగుతున్నాయా లేదా అనిపిస్తోంది. పోలవరం పర్యటనలు లేవు, ప్రచార ఆర్భాటాలు లేవు. అక్కడ పనులు నడుస్తున్నాయా అని అందరూ అనుకుంటున్నారు. కానీ వైఎస్ జగన్ తన పని తాను సైలెంట్‌గా చేసుకొని పోతున్నారు. పోలవరం ప్రాజెక్టును 2021 ఆఖరులోపు పూర్తి చేయడానికి ఒక ప్రణాళిక సిద్దం చేశారు. ఇప్పటికే రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 838.51 కోట్లు ఆదా చేసిన జగన్.. కాంట్రాక్టర్లు, అధికారులు, మంత్రులకు టార్గెట్లు పెట్టి ఎలాగైనా నిర్ణీత సమయంలో ఈ భారీ ప్రాజెక్టును పూర్తి చేసి ఏపీని సస్యశామలం చేసే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. స్పిల్ వే, స్పిల్ చానల్‌కు సంబంధించిన కాంక్రీట్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి.

కరోనా కారణంగా స్వగ్రామాలకు వెళ్లిపోయన కూలీలు, కార్మికులను కాంట్రాక్టు సంస్థ మేఘా.. ప్రత్యేక రైళ్ల ద్వారా వారిని ప్రాజెక్ట్ వద్దకు తిరిగి రప్పించింది. భౌతిక దూరం పాటిస్తూ ప్రతీ రోజు 3వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనిని చేయిస్తోంది. స్పిల్ వే లో 2వేల క్యూబిక్ మీటర్లు, స్పిల్ ఛానల్‌కు సంబంధించి 1 వెయ్యి క్యూబిక్ మీటర్ల పని జరుగుతోంది. జూన్ 24 నాటికి స్పిల్‌వేలో 1.29 లక్షల క్యూబిక్ మీటర్లు, స్పిల్ చానల్‌లో 0.98 లక్షల క్యూబిక్ మీటర్లు.. మొత్తం 2.77 లక్షల క్యూబిక్ మీటర్ల పని పూర్తయ్యింది. స్పిల్‌ వేలో 2.62 లక్షలు, స్పిల్‌ చానల్‌లో 6.98 లక్షల క్యూబిక్‌ మీటర్ల పనులు మే 2021 నాటికి పూర్తవుతాయని పోలవరం పనులను పర్యవేక్షిస్తున్న ఎస్ఈ నాగిరెడ్డి తెలిపారు.

సాధారణంగా గోదావరికి జులై చివరి నాటికి వరద మొదలవుతుంది. కాబట్టి వరదలు తగ్గుముఖం పట్టిన తర్వాత నవంబర్‌లో ప్రారంభించి 2021 జులై నాటికి స్పిల్ వే, స్పిల్ చానల్ పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది గోదావరి వరద స్పిల్ వే మీదుగానే వెళ్తుందని అధికారులు చెబుతున్నారు. ఇక ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల మధ్య ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ (ఈసీఆర్ఎఫ్) పనులు 2021 డిసెంబర్ నాటికి పూర్తవుతాయని అంటున్నారు. అప్పటిలోగా జలాశయాన్ని కాలువలతో అనుసంధానం చేస్తారు. మొత్తంగా 2022 జూన్ తర్వాత ఆయకట్టుకు నీరందించడమే లక్ష్యంగా పూర్తి స్థాయిలో పనులు జరుగుతున్నాయి.

గత ప్రభుత్వ హయాంలో రోజుకు 150 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు జరిగితే, ప్రస్తుతం రోజుకు 3వేల క్యూబిక్ మీటర్ల పనులు జరుగుతున్నాయంటేనే తెలుస్తోంది పనులు ఎంత వేగంగా సాగుతున్నాయో.

మరోవైపు పునరావస పనులు కూడా శరవేగంగా చేస్తున్నారు. గత ఏడాది 41.15 మీటర్ల కాంటూర్ ఎగువన ఉన్న గ్రామాల ప్రజలూ వరద ముప్పును ఎదుర్కున్నారు. కాబట్టి జూలై నాటికి 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలోని 15,444 కుటుంబాలకు పునరావాసం కల్పించాలని సర్కార్‌ నిర్ణయించింది. సహాయ, పునరావాసం పనులకే రూ.30 వేల కోట్లకుపైగా సర్కార్‌ వ్యయం చేస్తోంది.

First Published:  25 Jun 2020 12:55 AM GMT
Next Story