Telugu Global
National

జగన్‌ ఫొటోతోనే గెలిచాను.... యూటర్న్ తీసుకున్న రఘురామకృష్ణంరాజు

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం వైసీపీలో హాట్‌టాపిక్‌ అయింది. కొన్నాళ్లుగా సొంత పార్టీ నేతలపైనే కొన్ని ఆరోపణలు చేశారు. సవాళ్లు విసిరారు. దీంతో వైసీపీ అధిష్టానం ఆయనకు షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. షోకాజ్‌ నోటీసులు ఇవ్వకముందు ఎంపీ మాటలకు అంతులేకుండా ఉండేది. కానీ ఒక్కసారి నోటీసు రావడంతో టోన్‌ తగ్గించారు. సీఎం అపాయింట్‌మెంట్‌ ఇస్తే చాలు అంటూ కొత్త మాటలు మాట్లాడుతున్నారు. జగన్‌ ఫొటోతోనే తనకు 90 శాతం […]

జగన్‌ ఫొటోతోనే గెలిచాను.... యూటర్న్ తీసుకున్న రఘురామకృష్ణంరాజు
X

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం వైసీపీలో హాట్‌టాపిక్‌ అయింది. కొన్నాళ్లుగా సొంత పార్టీ నేతలపైనే కొన్ని ఆరోపణలు చేశారు. సవాళ్లు విసిరారు. దీంతో వైసీపీ అధిష్టానం ఆయనకు షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

షోకాజ్‌ నోటీసులు ఇవ్వకముందు ఎంపీ మాటలకు అంతులేకుండా ఉండేది. కానీ ఒక్కసారి నోటీసు రావడంతో టోన్‌ తగ్గించారు. సీఎం అపాయింట్‌మెంట్‌ ఇస్తే చాలు అంటూ కొత్త మాటలు మాట్లాడుతున్నారు. జగన్‌ ఫొటోతోనే తనకు 90 శాతం ఓట్లు వచ్చాయని చెప్పుకొచ్చారు. నిన్నటి మొన్నటి వరకూ మీరు రండి…. నేను వస్తా అంటూ తొడగొట్టిన ఎంపీ రఘురామకృష్ణంరాజు… సడెన్‌గా యూటర్న్‌ తీసుకున్నారు.

పార్టీ పంపిన 18 పేజీల షోకాజ్‌ నోటీసుకు సమాధానమిస్తానని ఎంపీ చెప్పారు. తాను పార్టీని కానీ…పార్టీ అధ్యక్షుడిని గానీ పల్లెత్తు మాట అనలేదని వివరణ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలు కొన్ని అనుకున్నట్లు ఇంప్లిమెంట్‌ కావడం లేదని… ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్‌ దొరకకపోవడంతో కొన్ని సూచనలు మీడియా ద్వారా చేసినట్లు చెప్పుకొచ్చారు. పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డికి రెండు రోజుల్లో సమాధానమిస్తానని అన్నారు.

ఇతర ఎంపీల కంటే రఘురామకృష్ణంరాజుకు ఎక్కువ విలువ ఇచ్చామని పార్టీ నేత విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. సీఎం వల్లే ఆయనకు పదవులు లభించాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

మొత్తానికి షోకాజ్‌ నోటీసు అందడంతో ఎంపీ స్వరం మారిందని గుసగుసలు విన్పిస్తున్నాయి. ఎల్లోమీడియాలో హైలైట్‌ కావడం తప్పా… తనకు వేరే మార్గం లేదని… తన వ్యాపారాలు చక్కబెట్టుకోవాలంటే సైలెంట్‌ కావడమే మేలని రఘురామకృష్ణంరాజు ఒక నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు.

First Published:  24 Jun 2020 9:08 PM GMT
Next Story