ఆచార్య ఔట్… వకీల్ సాబ్ ఇన్

పవన్ కల్యాణ్ రీఎంట్రీ మూవీకి సంబంధించి ప్లాన్స్ మారుతున్నాయి. ఈ మూవీకి సంబంధించి కేవలం 30 రోజుల షూటింగ్ మాత్రం పెండింగ్ ఉంది. వీలైనంత త్వరగా ఆ షూట్ పూర్తిచేసి, ఈ ఏడాదిలోనే సినిమాను రిలీజ్ చేయొచ్చు. ఫ్యాన్స్ కోరుకునేది కూడా అదే. కానీ ఇప్పుడీ సినిమాను సంక్రాంతి బరిలో నిలపాలని భావిస్తున్నాడు నిర్మాత దిల్ రాజు. దీనికి ఓ రీజన్ ఉంది.

లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ అన్నీ నిలిచిపోయాయి. దీంతో పెద్ద సినిమాల సంక్రాంతి ప్లాన్స్ అన్నీ వేస్ట్ అయ్యాయి. ఉదాహరణకు ఆచార్య సినిమానే తీసుకుంటే, చిరంజీవి నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి రావడం చాలా కష్టం. ఇప్పటివరకు కేవలం 40శాతం షూట్ మాత్రమే పూర్తయింది. ఇక రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా ఇప్పటికే సంక్రాంతి బరి నుంచి తప్పుకుంది. అటు రజనీకాంత్ నటిస్తున్న అన్నాతై సినిమా కూడా సంక్రాంతి నుంచి తప్పుకుంది. బాలయ్య సినిమా కూడా ఎంత ఫాస్ట్ గా పూర్తిచేసినా సంక్రాంతి టార్గెట్ ను అందుకోవడం కష్టం.

ఇలా పెద్ద సినిమాలన్నీ సంక్రాంతి రేసు నుంచి తప్పుకోవడంతో వకీల్ సాబ్ కు ఇది అనుకోని వరంగా మారింది. సంక్రాంతికి ఈ సినిమా సాఫీగా థియేటర్లలో ల్యాండ్ అయిపోతుంది. ఎందుకంటే 30 రోజుల షూటింగ్ పెండింగ్ తో పాటు.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ దాదాపు పూర్తయింది.

సో.. ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వకీల్ సాబ్ ను సంక్రాంతికి దించాలని దిల్ రాజు భావిస్తున్నాడట. ఇదే కనుక నిజమైతే పవన్ ఫ్యాన్స్ కు అంతకంటే ఇంకేం కావాలి. వాళ్లకు ఇదే పెద్ద పండగ.