రేణుదేశాయ్ రీఎంట్రీ ఫిక్స్

తనకు ఇప్పుడిప్పుడే తనపై నమ్మకం కలుగుతోందని, మరోసారి కెమెరా ముందుకొచ్చే ధైర్యం వస్తోందని రీసెంట్ గా చెప్పుకొచ్చింది పవన్ మాజీ భార్య రేణుదేశాయ్. ఇప్పుడు దాన్ని నిజం చేస్తూ ఓ క్రేజీ ప్రాజెక్టులో ఆమె అవకాశం దక్కించుకున్నట్టు తెలుస్తోంది. అవును.. మహేష్ బాబు నిర్మాతగా తెరకెక్కుతున్న మేజర్ సినిమాలో ఓ కీలకమైన పాత్ర కోసం రేణుదేశాయ్ ను అనుకుంటున్నారు.

అడివి శేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చాలా ట్విస్టులు ఉంటాయట. అందులో ఓ కీలకమైన ఎపిసోడ్ లో రేణు కనిపించబోతున్నారని తెలుస్తోంది. దీనిపై ప్రస్తుతానికి యూనిట్ నుంచి ఎలాంటి సమాచారం లేదు.

నిజానికి మేజర్ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ లేవు. షూట్ మాత్రం దాదాపు సగం పూర్తిచేశారు. సో.. కరోనా పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ తో పాటు రేణు దేశాయ్ ఎంట్రీ గురించి అధికారికంగా ప్రకటన చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ సినిమాను మహేష్ బాబుతో పాటు చాలామంది కలిసి నిర్మిస్తున్నారు. అడివి శేష్ కూడా ఒక నిర్మాత.