సమంతకు కరోనా సోకిందా?

ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ఈ అంశంపైనే నడుస్తోంది. స్టార్ హీరోయిన్ కు కరోనా సోకిందనే ప్రచారం గంటగంటకు ఎక్కువైపోతోంది. దీని వెనక ఓ కారణం ఉంది.

ప్రముఖ పేజ్ త్రీ సెలబ్రిటీ, ఫ్యాషన్ డిజైనర్ శిల్పా రెడ్డికి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించింది కూడా. అంతా ధైర్యంగా ఉండాలని, కరోనాను ఎదుర్కోవాలని పిలుపునిస్తూ వీడియో కూడా రిలీజ్ చేసింది. అయితే ఈ ఎపిసోడ్ కు ముందు ఆమె సమంతను కలిసింది. ఇద్దరూ కలిసి ఓ ఫొటో కూడా దిగి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.

దీంతో సమంతకు కూడా కరోనా సోకి ఉంటుందంటూ ప్రచారం మొదలైంది. ఇది ఇక్కడితో ఆగలేదు. సమంత, నాగచైతన్య కలిసి కరోనా పరీక్షలు కూడా చేయించుకున్నారని, అందులో వాళ్లకు నెగెటివ్ వచ్చిందంటూ కొత్తగా మరో ప్రచారం కూడా మొదలైంది.

దీనిపై అక్కినేని కుటుంబం నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. అటు సమంత మాత్రం ఈ పుకార్లతో సంబంధం లేకుండా తన రొటీన్ లైఫ్ కు సంబంధించిన ఫొటోల్ని సోషల్ మీడియాలో పెడుతూనే ఉంది.