ఏపీలో కరువు నివారణ ప్రాజెక్టులకూ ఎన్పీవీ

ఆంధ్రప్రదేశ్‌లో కరువు ప్రాంతాలకు సాగునీరు అందించే పథకాలను ఏపీ ప్రభుత్వం చేపట్టబోతోంది. ఇందుకోసం స్పెషల్ పర్పస్ వెహికల్(ఎన్పీవీ)ని ఏర్పాటు చేసింది.

కృష్ణా నది వరద శ్రీశైలం ప్రాజెక్టులకు అతితక్కువ రోజులు మాత్రమే వస్తుండడంతో నెల రోజుల్లోనే గరిష్ట స్థాయిలో శ్రీశైలం నుంచి రాయలసీమకు నీటిని అందించేందుకు గాను కాలువలు వెడల్పు చేయడం, కొత్తగా ప్రాజెక్టులను చేపట్టబోతోంది. ఇందులో భాగంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యం పెంపుకు శ్రీకారం చుడుతోంది.

ఇందుకోసం ఆంధ్రప్రదేశ్‌ రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో స్పెషల్ పర్పస్ వెహికల్‌ను ఏర్పాటు చేసింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తక్కువ వడ్డీకే రుణాలు తెచ్చి రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టుల పనులను చేపట్టనున్నారు. పనుల పురోగతిని స్పెషల్ పర్పస్‌ వెహికల్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది.