ఏపీ సీఎం కార్యాలయంలోకి అడుగు పెట్టిన కరోనా…..

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వేగంగా పెరుగుతోంది. ఇప్పటికే హై కోర్ట్, సచివాలయంలో పలువురు కరోనా బారినపడ్డారు. ఇప్పుడు సిఎంవోలోకి కరోనా అడుగు పెట్టింది.

సీఎంవోలో విధులు నిర్వహిస్తున్న సీనియర్ ఐఏఎస్ ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయన తన తోటి ఐఏఎస్ లకు తెలియజేశారు.

ఐఏఎస్ తో పాటు సీఎంవోలో ఉన్న మరో ముగ్గురు ఉద్యోగులు కూడా కరోనా బారినపడ్డారు. దీంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కరోనా సోకిన వారితో సన్నిహితంగా ఉన్నవారు క్వారంటెన్ కు వెళ్లిపోయారు.

సీఎంవోలో ఇటీవల నిర్లక్ష్యం పెరిగింది అన్న విమర్శ కూడా ఉంది.