Telugu Global
International

ఈ ఏడాది కరోనా వ్యాక్సిన్ రావడం కష్టమే " డబ్ల్యూహెచ్‌వో

ప్రపంచవ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తున్న కోవిడ్-19 వ్యాధికి సంబంధించి వ్యాక్సిన్ తయారీలో 100కు పైగా బృందాలు పనిచేస్తున్నాయి. ఒక వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి కనీసం ఏడాది సమయం పడుతుంది. గత ఏడాది డిసెంబర్‌లో చైనాలో తొలిసారిగా కరోనా వైరస్ ను కనుగున్న తర్వాత దాని జీనోమ్‌ను చైనా ఇతర దేశాలతో పంచుకుంది. చైనా ఇచ్చిన సార్స్ కోవ్ 2 వైరస్ జీనోమ్ ఆధారంగా అమెరికా, ఇటలీ, బ్రిటన్, జర్మనీ తదితర దేశాలు వ్యాక్సిన్ అభివృద్ధిని […]

ఈ ఏడాది కరోనా వ్యాక్సిన్ రావడం కష్టమే  డబ్ల్యూహెచ్‌వో
X

ప్రపంచవ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తున్న కోవిడ్-19 వ్యాధికి సంబంధించి వ్యాక్సిన్ తయారీలో 100కు పైగా బృందాలు పనిచేస్తున్నాయి. ఒక వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి కనీసం ఏడాది సమయం పడుతుంది. గత ఏడాది డిసెంబర్‌లో చైనాలో తొలిసారిగా కరోనా వైరస్ ను కనుగున్న తర్వాత దాని జీనోమ్‌ను చైనా ఇతర దేశాలతో పంచుకుంది.

చైనా ఇచ్చిన సార్స్ కోవ్ 2 వైరస్ జీనోమ్ ఆధారంగా అమెరికా, ఇటలీ, బ్రిటన్, జర్మనీ తదితర దేశాలు వ్యాక్సిన్ అభివృద్ధిని ప్రారంభించాయి. బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగిన పరిశోధనలు ఫలిస్తున్నాయని వార్తలు వచ్చాయి. కానీ అవి మనుషులపై జరిపిన ట్రయల్స్‌లో విఫలం కావడంతో మళ్లీ వ్యాక్సిన్ తయారీ ముందుకు వచ్చింది.

ప్రస్తుతం 140 వ్యాక్సిన్లు ప్రయోగ దశలో ఉన్నాయి. వీటిలో ఇంకా మనుషులపై ప్రయోగాలు చేయని వ్యాక్సిన్లే 125 వరకు ఉన్నాయి. మరి కొన్ని వ్యాక్సిన్లు మూడో దశ ట్రయల్స్ వరకు చేరుకున్నాయి. కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంత వరకు ఒక్క వ్యాక్సిన్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

కరోనాను నిరోధించే వ్యాక్సిన్ రూపకల్పన, అభివృద్ధికి ఏడాది సమయం పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథానోమ్ అన్నారు. ఈ వ్యాక్సిన్ అభివృద్ధి, ఉత్పత్తి, సరఫరాకు ప్రపంచ దేశాల సహకారం చాలా అవసరమని ఆయన అన్నారు. ఇప్పటికిప్పుడు కోవిడ్-19 వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి రావడం చాలా సవాలుతో కూడుకున్న వ్యవహారమని ఆయన అన్నారు.

వైరస్ బారిన పడే వారికి, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి మాతమ్రే టీకా ఇవ్వడం ఒక ఆప్షన్ మాత్రమే అని ఆయన అన్నారు. కరోనా వైరస్‌కు సంబంధించి డబ్ల్యూహెచ్‌వో కొన్ని తప్పులు చేసిన విషయాన్ని ఆయన అంగీకరించారు. తప్పులు అందరూ చేస్తారని.. కానీ తప్పుల నుంచి మేం నేర్చుకుంటున్నామని అన్నారు. దీనిపై ఒక స్వతంత్ర కమిటీని కూడా వేస్తున్నట్లు అథానోమ్ పేర్కొన్నారు. ఐరోపా పార్లమెంట్ కమిటీ ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో ఈ విషయాలు ఆయన వెల్లడించారు.

First Published:  26 Jun 2020 10:25 PM GMT
Next Story