పోలవరం పనులకై… భారీ క్రేన్లు, అరుదైన మెషినరీ తెప్పించిన మేఘా

ఆంధ్రప్రదేశ్‌కు జలప్రదాయిని కానున్న పోలవరం ప్రాజెక్టు పనులు యుద్ద ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. సీఎం వైఎస్ జగన్ స్వయంగా పోలవరం పనులకు లక్ష్యాలను నిర్థేశించడంతో గడువులోగా పూర్తి చేయాలని అటు అధికారులు ఇటు కాంట్రాక్టు సంస్థ మేఘా శర వేగంగా పనులు పూర్తి చేస్తోంది. 2021 డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేయాలన్నదే సీఎం జగన్ లక్ష్యం. దానికి తగినట్లుగా మేఘా సంస్థ ప్రాజెక్టు ప్రాంతంలో పనులను వేగవంతం చేసింది.

పోలవరం సైటులో అతిభారీ, అరుదైన మెషినరీలు, భారీ క్రేన్లతో పనులు చేపట్టింది. కాంక్రీటును కింద నుంచి 62 మీటర్ల ఎత్తుకు తీసుకొని వెళ్లే భూమ్ ప్లేసర్‌తో పనులు చేపట్టింది. ఈ మెషినరీ గంటకు 90 క్యూబిక్ మీటర్ల కాంక్రీటును మోసుకెళ్తుంది. ఇలాంటి మెషినరీని ఉపయోగించడం దేశంలోనే తొలిసారి.

దీంతో పాటు టెలీబెల్ట్ – 200 అనే మెషినరీని కూడా వాడుతున్నారు. ఇలాంటి మెషిన్లు ప్రపంచంలో కేవలం మూడే ఉన్నాయి. ప్రస్తుతం మేఘా సంస్థ పోలవరం పనులకు ఉపయోగిస్తున్న మెషిన్ ఆసియాలోనే మొదటిది. ఈ మెషిన్ సాయంతో గంటకు 200 క్యూబిక్ మీటర్ల కంటే ఎక్కువ కాంక్రీట్ పనులు చేయవచ్చు. ఇది సమాంతరంగా 60 మీటర్లు, 360 డిగ్రీల కోణంలో కదులుతూ పనులు చేస్తుంది. ఇక మెఘా కంపెనీ ఉపయోగిస్తున్న హైడ్రాలిక్ రిగ్ సాయంతో భూమిలో 50 మీటర్ల లోతైన రంధ్రాన్ని చేయవచ్చు. దీని వేగం 260 కిలోన్యూటన్ పర్ మీటర్.

2021 జూన్‌కల్లా స్పిల్ వే పూర్తి : ఏ. సతీష్ బాబు, జీఎం మేఘా

పోలవరం బహుళార్థక సాధక ప్రాజెక్టు ఆనకట్ట పనులు శర వేగంగా జరుగుతున్నాయి. క్రస్ట్ గేట్లను భిగించే పనులు నవంబర్‌లో ప్రారంభమవుతాయి. వచ్చే ఏడాది జూన్‌లో గోదావరి వరద నీరు స్పిల్ వే మీదుగా తరలించాలనే లక్ష్యం పెట్టుకున్నాం. సీఎం జగన్ ఆదేశాల ప్రకారం డిసెంబర్ 2021 కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని కాంట్రాక్టు సంస్థ మేఘా జనరల్ మేనేజర్ ఏ. సతీష్ బాబు స్పష్టం చేశారు. సాధ్యమైనంత వరకు వర్షాకాలంలో కూడా పనులు చేపట్టేలా ప్రణాళిక సిద్దం చేశామని ఆయన అన్నారు. గోదావరి నీటిని స్పిల్ వే మీదుగా వచ్చే జూన్‌లోనే మళ్లిస్తామని ఆయన అన్నారు.

గోదావరికి భారీగా వరద వస్తుంది. సైట్ ప్రాంతంలో వరద నిండటం వల్ల కొన్ని ఆటంకాలు ఏర్పడుతున్నాయి. కానీ భారీ మోటార్ల సాయంతో నీటిని తోడే పనులు చేపట్టాలని అనుకుంటున్నాము. ఇక కోవిడ్ కారణంగా సొంతూర్లకు వెళ్లిపోయిన కూలీలను దాదాపు 2,550 మందిని ప్రత్యేక రైళ్ల ద్వారా తిరిగి రప్పించాము. మరో 500 మంది మార్గమధ్యంలో ఉన్నారు. ఇంకా కూలీలు, కార్మికులు చాలా మంది అవసరమవుతారు. కానీ ఉన్న వారితోనే సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేస్తున్నామని సతీష్ బాబు తెలిపారు.

Polavaram project works going on war footing with Very big and rare machines and huge cranes

Polavaram project works going on war footing with Very big and rare machines and huge cranes. Works with bhoom placer (concrete pasting) machines up to 62 meters height. Its machine capacity is 90 cubic meters per hour. These machines used in Polavaram for the first time in the country. Works going on with using Telebelt-200 machine. This type only 3 machines available in the world. This is the one among them and first in Asia. With the help of this machine can work 200 plus cubic meters of concrete per hour.Goes horizontal at 61 meters, rotates 360 degrees. Height works within 0-30 degrees of radius. With the help of a hydraulic rig that Megha uses, the soil can be dug up to 50 meters. Its nominal torque is 260 kNm, with a kelly length of 15 meters, which is 1.2 meters dia.

Publiée par Megha Engineering and Infrastructures Ltd sur Vendredi 26 juin 2020