Telugu Global
Cinema & Entertainment

ఓటీటీకి ఏటీటీకి తేడా అదే

ఓటీటీ అంటే ఓవర్ ది టాప్. అదే ఏటీటీ అంటే ఎనీ టైమ్ థియేటర్. లాక్ డౌన్ పుణ్యమా అని ఓటీటీకి ఫుల్ డిమాండ్ పెరిగింది. జనాలంతా అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, జీ5, హాట్ స్టార్ లాంటి ఓటీటీలకు అతుక్కుపోయారు. అయితే ఇప్పుడిప్పుడే జనాల్లోకి వస్తోంది ఏటీటీ. ఈ కాన్సెప్ట్ ను ప్రవేశపెట్టిన వ్యక్తి శ్రేయాష్ శ్రీనివాస్. ఓటీటీలో ఏదైనా చూడాలంటే సబ్ స్క్రిప్షన్ తీసుకోవాలి. నెలకు, 3 నెలలకు లేదా ఏడాదికి కొంత చెల్లించాల్సి […]

ఓటీటీకి ఏటీటీకి తేడా అదే
X

ఓటీటీ అంటే ఓవర్ ది టాప్. అదే ఏటీటీ అంటే ఎనీ టైమ్ థియేటర్. లాక్ డౌన్ పుణ్యమా అని ఓటీటీకి ఫుల్ డిమాండ్ పెరిగింది. జనాలంతా అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, జీ5, హాట్ స్టార్ లాంటి ఓటీటీలకు అతుక్కుపోయారు. అయితే ఇప్పుడిప్పుడే జనాల్లోకి వస్తోంది ఏటీటీ. ఈ కాన్సెప్ట్ ను ప్రవేశపెట్టిన వ్యక్తి శ్రేయాష్ శ్రీనివాస్.

ఓటీటీలో ఏదైనా చూడాలంటే సబ్ స్క్రిప్షన్ తీసుకోవాలి. నెలకు, 3 నెలలకు లేదా ఏడాదికి కొంత చెల్లించాల్సి ఉంటుంది. సబ్ స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత సదరు యాప్ లో కంటెంట్ ప్రేక్షకుడికి నచ్చుతుందా లేదా అనేది తర్వాతి సంగతి. సరిగ్గా ఇక్కడే ఏటీటీ తెరపైకి వస్తోంది.

ఏటీటీకి సబ్ స్క్రిప్షన్ ఉండదు. ఇందులో సినిమాలు అప్ లోడ్ అవుతుంటాయి. నిర్మాత ఇష్టప్రకారం, ప్రతి సినిమాకు ఓ రేటు ఉంటుంది. ఏ సినిమా చూడాలనుకుంటే ఆ ఎమౌంట్ చెల్లించి ఆ సినిమా చూడొచ్చు. వచ్చే ఏడాది మార్చి నాటికి 50 సినిమాలు ప్రదర్శనకు పెట్టాలని భావిస్తోంది ఏటీటీ.

అంతాబాగానే ఉంది కానీ ఏటీటీకి, ఓటీటీకి మధ్య అతిపెద్ద వ్యత్యాసం ఒకటుంది. ఉదాహరణకు ఏటీటీలో వర్మ తీసిన నగ్నం సినిమా చూడాలనుకుంటే 200 రూపాయలు కట్టాలి. అదే 200 రూపాయలకు నెట్ ఫ్లిక్స్ లో మంత్లీ సబ్ స్క్రిప్షన్ వస్తుంది. సినిమాలు, వెబ్ సిరీస్, ఒరిజినల్ కంటెంట్.. ఇలా ఏది కావాలంటే అది నెల రోజుల పాటు చూసుకోవచ్చు. సో.. ఏటీటీ క్లిక్ అవ్వాలంటే స్ట్రీమింగ్ కు పెట్టే సినిమాల్లో దమ్ము ఉండాలి.

First Published:  27 Jun 2020 9:27 PM GMT
Next Story