లూసిఫర్ స్పీడ్ పెంచాడు

చిరంజీవి చేయాల్సిన లూసిఫర్ రీమేక్ పనులు ఊపందుకున్నాయి. ఈ మూవీకి సంబంధించి దర్శకత్వ బాధ్యతల్ని సుజీత్ కు అప్పగించిన సంగతి తెలిసిందే. సినిమాను క్షుణ్నంగా చూసిన సుజీత్.. చిరంజీవి సూచనల మేరకు లూసిఫర్ ప్రాజెక్టుకు మార్పులు చేర్పులు చేశాడు.

సుజీత్ చెప్పిన ఫైనల్ వెర్షన్ చిరంజీవికి బాగా నచ్చింది. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో ఇప్పుడీ ప్రాజెక్టుకు డైలాగ్ వెర్షన్ రెడీ అవుతోంది. దర్శకుడు సుజీత్ తో కలిసి మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా.. లూసిఫర్ తెలుగు వెర్షన్ కు డైలాగ్స్ రాస్తున్నాడు.

లూసిఫర్ ఒరిజినల్ వెర్షన్ లో హీరో ఎలివేషన్స్ తక్కువగా ఉంటాయి. మోహన్ లాల్ లాంటి హీరో ఉన్నప్పటికీ ఎలివేషన్స్ అందులో తక్కువ. కథకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. కానీ తెలుగు వెర్షన్ కు వచ్చేటప్పటికి మాత్రం చిరంజీవి ఎలివేషన్స్ భారీగా ఉండబోతున్నాయి. ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఎలివేషన్ ను ప్రత్యేకంగా డిజైన్ చేశాడట సుజీత్.

ఈ విషయంలో దర్శకుడ్ని శంకించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సాహో ఫ్లాప్ అయినా, అందులో హీరో ఎలివేషన్స్ ఎంతలా క్లిక్ అయ్యాయో అందరం చూశాం. కాబట్టి లూసిఫర్ లో కూడా చిరంజీవి అదరగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.