Telugu Global
Cinema & Entertainment

నగ్నం మూవీ రివ్యూ...

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎంత దిగజారిపోయాడో చెప్పడానికి మరో ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది నగ్నం సినిమా. దీన్ని సినిమా అనే కంటే షార్ట్ ఫిలిం అనడం కరెక్ట్. కేవలం 22 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాను బాహుబలి రేంజ్ లో ప్రచారం చేసి సొమ్ము చేసుకున్నాడు వర్మ. జనాలకు మరోసారి నరకం చూపించాడు. శ్రేయాస్ మీడియాతో కలిసి తన ఓటీటీ వేదికపై వర్మ రిలీజ్ చేసిన ఈ సినిమా ఆద్యంతం మన నవరంద్రాల్లో సూదులు […]

నగ్నం మూవీ రివ్యూ...
X

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎంత దిగజారిపోయాడో చెప్పడానికి మరో ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది నగ్నం సినిమా. దీన్ని సినిమా అనే కంటే షార్ట్ ఫిలిం అనడం కరెక్ట్. కేవలం 22 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాను బాహుబలి రేంజ్ లో ప్రచారం చేసి సొమ్ము చేసుకున్నాడు వర్మ. జనాలకు మరోసారి నరకం చూపించాడు.

శ్రేయాస్ మీడియాతో కలిసి తన ఓటీటీ వేదికపై వర్మ రిలీజ్ చేసిన ఈ సినిమా ఆద్యంతం మన నవరంద్రాల్లో సూదులు గుచ్చిన ఫీలింగ్ ను కలిగిస్తుంది…

ఒక ఇంట్లో జరిగిన ఓ అక్రమ సంబంధం కథతో సినిమా చుట్టేశాడు వర్మ. ఇంత చెత్త కథను, ఇంత చెత్త ప్రొడక్షన్ వాల్యూస్ ను ఇప్పటివరకు వర్మ సినిమాల్లో మనం చూసి ఉండం. ఇంకా చెప్పాలంటే ఇలాంటి కథల్ని 90ల్లోనే షకీలా చేసేసింది.

సినిమాలో హీరోయిన్ ఎక్స్ పోజింగ్, కెమెరామెన్ ఫ్రేమ్స్ తప్పితే ఇంకేం కనిపించవు. కనీసం హీరోయిన్ కు నటించే అవకాశం ఇవ్వలేదు వర్మ. ఆమె అందాల్ని చూపించడం, కవ్వించేలా ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడం వరకే స్వీటీని పరిమితం చేశాడు. ఇక కెమెరా యాంగిల్స్ అయితే నరకాన్ని పరిచయం చేస్తాయి.

హీరోయిన్ కు ఎక్కడెక్కడ కెమెరాలు పెట్టకూడదో ఆలోచించి మరీ అక్కడే ఫ్రేమ్స్ ఫిక్స్ చేశాడు ఈ దర్శకుడు. చివరికి కెమెరాలు దూరని శరీర భాగాలు, ప్రదేశాల్లో మొబైల్ తో షూట్ చేశాడంటే వర్మ మెంటాలిటీని అర్థం చేసుకోవచ్చు.

వర్మ సినిమాల్లో కేవలం ట్రయిలర్ మాత్రమే బాగుంటుంది. ట్రయిలర్ లో ఉన్నదే సినిమాలో ఉంటుందనే రిమార్క్ ఉంది. అది రిమార్క్ కాదు, పచ్చి నిజం. గతంలో చాలా సినిమాలతో అది నిజమని ప్రూవ్ చేసిన ఆర్జీవీ, ఈ నగ్నంతో మరోసారి ఆ రిమార్క్ ను నిజం చేశాడు.

ఇక ఈ 22 నిమిషాల సినిమాను రెగ్యులర్ రివ్యూలా నటీనటుల పనితీరు, టెక్నీషియన్స్ వర్క్ అంటూ విడదీసి చూడడానికేం లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే వర్మ పైశాచికత్వానికి, పీక్స్ లో అంగాంగ ప్రదర్శనకు మాత్రమే ఈ 22 నిమిషాల బొమ్మ సరిపోతుంది.

200 రూపాయలు పెట్టి ఓటీటీ వేదికగా ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఇప్పటికే సినిమా చూసిన జనాలు లబోదిబోమంటున్నారు.

First Published:  29 Jun 2020 8:26 AM GMT
Next Story