ఎన్టీఆర్‌కు భారతరత్న కేసీఆర్‌, జగన్‌ ఇప్పించాలి – సోమిరెడ్డి

ఎన్టీఆర్‌ వర్దంతి, జయంతి రోజు తప్పనిసరిగా టీడీపీ చేసే డిమాండ్‌ ఆయనకు భారతరత్న ఇవ్వాలి అని. తీర్మానాలకే టీడీపీ పరిమితం అయింది కానీ… కేంద్రంలో భాగస్వామిగా ఉన్నప్పుడు కూడా దాన్ని సాధించింది లేదు. ఇప్పుడు ఆ బాధ్యతను కేసీఆర్‌, జగన్‌ తీసుకోవాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది.

పీవీ జయంతి సందర్భంగా పలువురు ఆయనకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి…. పీవీ ఒక్కరికే కాకుండా ఎన్టీఆర్‌కు కూడా భారతరత్న ఇప్పించాలని కోరారు. ఎన్టీఆర్‌కు, పీవీకి భారతరత్న ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు.

కేంద్రం ఎన్టీఆర్‌కు భారతరత్న ఇచ్చేలా… రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రాన్ని డిమాండ్ చేయాలన్నారు. గతంలో ఎన్టీఆర్‌ కోసం తాము కేబినెట్‌లో తీర్మానాలు చేసి పంపించామని… ఆయనకు భారతరత్న వచ్చేలా కేసీఆర్, జగన్‌ కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు.